దేవినేనికి కొత్త ఆప్షన్..మైలవరం వదులుకోవలా?

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో రాజకీయాలు ఊహించని విధంగా మారుతున్నాయి..గత ఎన్నికల్లో ఓటమి నుంచి బయటపడి జిల్లాలో బలపడుతున్న టీడీపీలో సమీకరణాలు మారుతున్నాయి. ఇక్కడ కొన్ని కీలక మార్పులు జరిగేలా ఉన్నాయి. కొన్ని సీట్లలో అభ్యర్ధులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో జిల్లాలో సీనియర్ గా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమాని..చంద్రబాబు కీలక స్థానంలో నిలబెట్టడానికి చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

ఈ సారి మైలవరం వదిలేసుకుని దేవినేని..గుడివాడ లేదా గన్నవరం నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని కొత్త ప్రచారం వస్తుంది. ఇటీవల మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..చంద్రబాబుకు కాస్త అనుకూలంగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు తొక్కిసలాట ఘటనలో వుయ్యూరు ఫౌండేషన్ అధినేత శ్రీనివాసరావుని ప్రభుత్వం అరెస్ట్ చేయడాన్ని తప్పుబట్టారు.  ఇలా టీడీపీకి కాస్త అనుకూలమైన స్వరం వినిపిస్తున్న వసంత..నెక్స్ట్ టీడీపీలోకి రావడానికి సిద్ధమయ్యారని టాక్ నడుస్తోంది. పైగా మైలవరం వైసీపీలో మంత్రి జోగి రమేష్ వర్గంతో వసంతకు పడని పరిస్తితి.

దీంతో ఆయన వైసీపీ వదిలి టీడీపీలోకి వచ్చి..మైలవరం సీటులో పోటీ చేస్తారని ప్రచారం నడుస్తోంది. అదే సమయంలో అక్కడ ఉన్న దేవినేని ఉమాని..గుడివాడ లేదా గన్నవరంకు పంపిస్తారని టాక్. అయితే ఇదంతా కేవలం ప్రచారం మాత్రమే. ఇందులో నిజనిజాలు ఏంటి అనేది ఎవరికి క్లారితే లేదు.

సీనియర్ నేత దేవినేనిని వేరే నియోజకవర్గానికి పంపించేలా బాబు ఆలోచిస్తారని అనుకోవడానికి లేదు. కానీ రాజకీయాల్లో ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది. రాజకీయ సమీకరణాలు ఎలా అయినా మారిపోవచ్చు. మరి చూడాలి కృష్ణా జిల్లా టీడీపీలో ఎలాంటి ట్విస్ట్‌లు చోటు చేసుకుంటాయో.