నక్క తోక తొక్కిన శ్రీ లీల… ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో…!

పవన్ కళ్యాణ్ హీరోగా సాహో దర్శకుడు సుజిత్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు అధికంగా ప్రకటించాడు. ఇక ఈ సినిమాను డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నాడు. అయితే ఈ సినిమాను కోలీవుడ్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారని వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాల గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా పూర్తి అయిన వెంటనే హరీష్ శంకర్‌తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్‌లో బిజీ అవునన్నాడు. ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో వచ్చే సినిమా షూటింగ్ మొదలు పెడతారని తెలుస్తుంది. టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గురించి ఇంట్ర‌స్టింగ్ మ్యాట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

రీసెంట్ గా ధమాకా సినిమాతో అదిరిపోయే హిట్‌ అందుకున్న ముద్దుగుమ్మ శ్రీ లీల-పవన్ కళ్యాణ్ కు జంటగా హీరోయిన్‌గా ఎంపిక చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన శ్రీ లీల ఇటీవల ధమాకా సినిమాతో తన కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. మాస్ మహారాజా రవితేజకు జోడిగా శ్రీ లీలా బాగా సెట్ అయిందని అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను కూడా ఈమె బాగా సూట్ అవుతుందని అంటున్నారు.

Exclusive: Pawan Kalyan and Sujeeth film Locked

అందుకే పవన్ కళ్యాణ్- సుజిత్ సినిమాలో ఈమెని హీరోయిన్‌గా ఎంపిక చేసే విషయంపై చర్చలు జరుగుతున్నాయట. అయితే ఈ సినిమాకు శ్రీలీల నుంచి కేవలం 15 నుంచి 20 రోజులు వరకు డేట్లు మాత్రమే అడుగుతున్నారంటూ తెలుస్తుంది. అందుకు గాను ఆమె భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది.

మరి కొద్ది రోజుల్లో ఈ విషయంపై అధికారి ప్రకటన రానుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఒకవేళ పవన్ కళ్యాణ్ కు జంటగా శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగి టాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.