“వీర సింహా రెడ్డి” పంచ్ డైలాగ్స్: వారి మనోభావాలు దెబ్బతిన్నాయా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయాన్ని చాలా కేర్ గా ఎక్కువ ఫోకస్ చేస్తూ చూస్తున్నారు జనాలు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉంటున్న స్టార్ హీరోలు కొన్ని పొలిటికల్ ఇష్యూస్ కారణంగా తమ సినిమాలో పరోక్షకంగా వాళ్ళపై కౌంటర్లు వేస్తూ ఘాటుగా జవాబు ఇస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా నందమూరి బాలయ్య హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా లోను అలాంటి పవర్ఫుల్ పొలిటికల్ పంచ్ డైలాగ్స్ తగలాల్సిన వాళ్లకు ఘాటుగా తగిలినట్టు అర్థమవుతుంది.

మనకు తెలిసింది బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన రీసెంట్ సినిమా వీర సింహారెడ్డి . జనవరి 12వ తేదీన ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ దక్కించుకుంది. ఈ సినిమా హిట్ అవ్వడానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ కొన్ని పొలిటికల్ పంచ్ డైలాగ్స్ ఉండడమే ప్రధాన కారణం అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలోనే బాలయ్య కొందరు రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ ఘాటుగా తన సినిమాతో కౌంటర్ ఇచ్చాడు అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ . వీరసింహారెడ్డి సినిమాలో పలు డైలాగ్స్ కొందరు రాజకీయ నేతలకు బాగా తగిలాయి.

ఈ క్రమంలోనే బాలకృష్ణ సినిమాలో చెప్పిన డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా మినిస్టర్ నుండి ఫోన్ వచ్చినప్పుడు పక్కనున్న సైట్ క్యారెక్టర్..” నువ్వు వెళ్లడం ఏమిటి పెద్దన్న” అంటూ అడగ్గా.. బాలయ్య మాట్లాడుతూ..”ప్రజలు ఎన్నుకున్న వెధవలు రా వాళ్ళు.. గౌరవించడం మన ధర్మం “అని చెప్పే డైలాగ్ గట్టిగా ఎవరికో తగిలింది . అంతేకాదు “మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ నా జీవో గాడ్స్ ఆర్డర్ “అని చెప్పే బాలకృష్ణ డైలాగ్ “పదవి చూసుకొని నీకు ఆ పొగరు ఏమో.. బై బర్త్ నా డీఎన్ఏకు పొగరు ఎక్కువ” అంటూ గంభీరంగా చెప్పే బాలకృష్ణ డైలాగ్ బాగా పేలింది .

అంతేనా “మూతి మీద మొలిచిన ప్రతి బొచ్చు మీసం కాదురా బచ్చా”.. అంటూ బాలకృష్ణ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ బాగా హీట్ అయింది. ఎన్ని వందల మంది నైనా వెంటేసుకొని రా చివరి తల తెగేవరకు కత్తి వదలను చెయ్యి మార్చను ఒంటి చేత్తో ఊచ కోత కోస్తా నా కొడకా” అంటూ బాలయ్య చెప్పే పవర్ఫుల్ డైలాగ్ సినిమాకి హైలెట్గా నిలిచింది . ఈ క్రమంలోనే బాలయ్య విసిరిన పరోక్ష కౌంటర్స్ కొందరి రాజకీయ నేతలకు ఘాటుగా తగిలాయని.. వారి మనోభావాలు దెబ్బతిన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి బాలయ్య వేసిన కౌంటర్స్ పై సదరు రాజకీయ నేతలు ఏ విధంగా స్పందిస్తారో..?