తారకరత్నకు సీటు రిజర్వ్ చేశారా?

నందమూరి ఫ్యామిలీ నుంచి తారకరత్న రాజకీయాల్లో యాక్టివ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే బాలయ్య, సుహాసిని రాజకీయాల్లో ఉన్నారు. ఇదే క్రమంలో తారకరత్న సైతం యాక్టివ్ అయ్యారు. సినిమాల్లో అంతగా క్లిక్ అవ్వని తారకరత్న..అప్పుడప్పుడు టీడీపీ కోసం ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆయన మరింత యాక్టివ్‌గా అయ్యారు. టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి ఇటీవల తారకరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సైతం టీడీపీ కోసం పనిచేస్తారని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో తాజాగా తారకరత్న..నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. లోకేష్ యువగళం పాదయాత్రకు మద్ధతు తెలిపేందుకు కలిసినట్లు తెలిసింది. అలాగే సీటు విషయంపై కూడా చర్చలు జరిగాయని అంటున్నారు. అయితే తారకరత్నకు సీటు ఇచ్చే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ పోటీ చేయడానికి కొన్ని సీట్లు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో గన్నవరం సీటు ఉండగా, గుంటూరు జిల్లాలో గుంటూరు వెస్ట్ సీటు ఉంది. మరి వీటిల్లో ఏ సీటు తారకరత్నకు ఇస్తారనేది క్లారిటీ లేదు.

అసలు సీటుపై హామీ ఇచ్చారా? లేదా? అనేది కూడా క్లారిటీ లేదు. కాకపోతే నందమూరి ఫ్యామిలీ కాబట్టి..తారకరత్నకు సీటు ఇచ్చే విషయం ఆలోచించవచ్చు. కాకపోతే ప్రస్తుతం గెలుపు అనేది ముఖ్యంగా కాబట్టి అన్నీ రాజకీయ సమీకరణాలని చూసుకుని తారకరత్నకు సీటు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి మరి తారకరత్నకు ఏ సీటు ఇస్తారో.