Dhamka.. ఓటిటి రిలీజ్ డేట్ లాక్..!!

హీరో రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా. హీరోయిన్ గా శ్రీ లీల నటించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 23వ తేదీన విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.ఈ సినిమాతో రవితేజ రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరారు. పక్క మాస్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైన ప్రతి చోట కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ పిక్చర్ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.

Ravi Tejas Dhamaka OTT Rights Acquired By This Platform

ప్రమోషన్లలో భాగంగా విడుదలైన పాటలు టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి ముఖ్యంగా ఈ సినిమాకు మొదటి షో నుంచి హీట్ టాకుతో దూసుకుపోయింది. ఇక త్వరలోనే ఈ సినిమా ఓటీటి లో రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటి సమస్త ధమాకా చిత్రాన్ని స్ట్రిమింగ్ చేయబోతుందని తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ఈనెల 22వ తేదీన స్ట్రిమింగ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయాన్ని ఓటిటి సంస్థ అధికారికంగా ప్రకటిస్తుందేమో చూడాలి మరి.

రవితేజ నుంచి ఇలాంటి హీట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు అభిమానులు. క్రాక్ సినిమా తర్వాత మళ్లీ రవితేజ ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక సంక్రాంతికి చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలకు కూడా స్పెషల్ అప్పీరెన్స్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక వీటితోపాటు రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలలో కూడా నటిస్తున్నారు రవితేజ.