తెగింపు సినిమా ఎలా ఉందంటే..?

హెచ్ వినోద్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తాజాగా నటించిన చిత్రం తునివు. ఈ సినిమాను తెలుగులో తెగింపు పేరిట ఈరోజు తెలుగు , తమిళ్లో ఏకకాలంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. బోణికపూర్, జీ స్టూడియో సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మొదటి షో తోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో మంజు వారియర్, జాన్ కొక్కెన్, సముద్రఖని తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సినిమా చూసినవారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇకపోతే తాజాగా ప్రేక్షకుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి భాగం చాలా బాగుందట.

Ajith Kumar Thegimpu Movie Review And Rating | అజిత్ తెగింపు రివ్యూ..  టికెట్లు తెగుతాయా? News in Telugu

స్లోగా మొదలైన ఈ సినిమా ఇంటర్వెల్ కు ముందు పుంజుకుందని సమాచారం. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను కాస్త విసిగిస్తాయట. అన్నిటికంటే మించి క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ చాలా బాగుంది అని అంటున్నారు. కొంచెం మనీ వేస్ట్ వంటి రిఫరెన్స్ లు వాడినా వాటికి.. తెగింపుకి సంబంధం లేదట ఓవరాల్ గా ఇది సంక్రాంతి పండుగకు చూసే సినిమా అని ప్రేక్షకులు చెబుతున్నారు. సాధారణంగా సంక్రాంతి పండుగ అంటే చాలా మంది ఫ్యామిలీ తో కలిసి సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తారు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

ఇందులో కొంచెం యాక్షన్ సన్నివేషాలు ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ మాస్ యాక్షన్ ఎలివేషన్స్ చిత్రాలను ఇష్టపడే అభిమానులకు ఈ సినిమా పక్క బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. అంతేకాదు అజిత్ కుమార్ ఈ సినిమాను వన్ మ్యాన్ షో గా ముందుకు తీసుకెళ్లారు అని చెప్పడంలో సందేహం లేదు. మాస్ యాక్షన్ సన్నివేశంగా తెరకెక్కిన ఈ సినిమా పక్క సంక్రాంతి ఫిలిం అని చెప్పడంలో సందేహం లేదు. మొత్తానికైతే అజిత్ ఈ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పవచ్చు.