జై బాలయ్య సాంగ్‌ను కూడా కాపీ కొట్టానంటూ థమన్ క్రేజీ కామెంట్స్..?

ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ‘వీర సింహరెడ్డి’ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికి ఈ సినిమా నుంచి ‘జై బాలయ్య’ అనే సాంగ్ విడుదల అయ్యి మంచి టాక్ సంపాదించుకుంది. అయితే ఈ సాంగ్‌పై కొన్ని కాపీ రైట్స్ ఆరోపణలు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. గతంలో వచ్చిన ‘ఒసేయ్ రాములమ్మ’ టైటిల్ సాంగ్ లానే ‘జై బాలయ్య’ పాట ఉందని ప్రేక్షకుల నుంచి విపరీతంగా కామెంట్స్ వచ్చాయి. ఈ కామెంట్స్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్పందించి అందరికి ఒక్క స్పష్టతని ఇచ్చారు.

ఒసేయ్ రాములమ్మ పాట రాసింది వందేమాతరం శ్రీనివాస్. ఇక ఆ పాటకు సంగీతం అందించింది తనే అని థమన్ తెలిపారు. వీర సింహ రెడ్డి సినిమాలో ‘జై బాలయ్య’ అనే పాటకు సంగీతం అందించే సమయంలో ఆయనకు ఒసేయ్ రాములమ్మ పాటనే గుర్తొచ్చింది అని థమన్ తెలిపారు. ఆడియన్స్ ఆ రెండు పాటలకు లింక్ పెడతారనే విషయం కూడా ఆయన ముందే ఊహించాలని చెప్పారు. క్రౌడ్ థీమ్ సాంగ్స్ దాదాపు ఒకే పిచ్ లో ఉండటం వల్ల ఇలాంటి పాటలను విన్నప్పుడు చాలా సార్లు విన్న పాటలనే అనిపిస్తుందని థమన్ వివరించారు.

ప్రస్తుతం జై బాలయ్య పాట గురించి థమన్ వివరించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే జై బాలయ్య పాటకు ఇంకో పాట మ్యాచ్ అవుతుందని తెలిసినప్పుడే థమన్ తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అని కొంతమంది అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం థమన్ చేతిలో మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. థమన్ కి మంచి టాలెంట్ ఉండటంతో ఆయనకి ఎప్పటికప్పుడు అవకాశాలు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. థమన్ ఒక్కో సినిమాకి 4 కోట్ల వరకు పరితోషకం తీసుకుంటారట. ఆ డబ్బులలో చాలా వరకూ సింగర్స్ కోసం ఖర్చు చేస్తారని సమాచారం. ఇక థమన్ కాపీ సాంగ్స్‌కి దూరంగా ఉంటే అతని ఫ్యూచర్ ఇంకా బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.