కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వరిసు(తెలుగులో వారసుడు)`. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్, శ్యామ్, జయసుధ, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందించాడు. నేడు ఈ చిత్రం తమిళంలో విడుదల అయింది. జనవరి 13న హిందీలో, జనవరి 14న తెలుగులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళంలో ఈ చిత్రానికి మధ్య రెస్పాన్స్ వస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ లాక్ అయింది. ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ `వారసుడు` డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నారట. అయితే థియేటర్స్ లో విడుదలైన రెండు నెలల తరవాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా డీల్ కుదుర్చుకున్నారని అంటున్నారు. అంటే వారసుడు ఓటీటీలోకి రావాలంటే మార్చి వరకు వెయిట్ చేయాల్సిందే.