యావ‌రేజ్‌ టాక్ తో బంప‌ర్ హిట్ కొట్టిన చిరు, బాల‌య్య‌.. అదెలా సాధ్య‌మైందో తెలుసా?

ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నట‌సింహ నందమూరి బాలకృష్ణ తలపడిన సంగతి తెలిసిందే. బాలయ్య `వీర సింహారెడ్డి` మూవీతో ప్రేక్షకులను పలకరిస్తే.. చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో వచ్చాడు. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. అలాగే రెండు సినిమాల్లోనూ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఒక్క రోజు వ్యవధిలో విడుదలైన ఈ చిత్రాలకు యావరేజ్ టాక్‌ లభించింది.

ఇంకా బిలో యావ‌రేట్ కంటెంట్ ఉన్న చిత్రాలివి. కానీ, టాక్ తో సంబంధం లేకుండా ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అటు చిరు ఇటు బాలయ్య ఇద్దరూ ఈ సంక్రాంతికి బంపర్ హిట్ కొట్టారు. అయితే యావ‌రేజ్ టాక్ తో అదెలా సాధ్యమైంది అనే సందేహం చాలా మందికి ఉంది. అయితే ఈ రెండు చిత్రాల‌కు కలిసొచ్చిన అంశం సంక్రాంతి.

సంక్రాంతి పండక్కి తెలుగు ప్ర‌జ‌లు సినిమాలు చూసేందుకు ఎక్కువ‌గా ఇష్టపడతారు. కాస్త బాగుంద‌నే టాక్ వ‌చ్చినా స‌రే ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూడ‌టం ఆనవాయితీ. ఈ కార‌ణంగా యావ‌రేజ్ రేటింగ్ తెచ్చుకున్న వాల్తేరు వీర‌య్య‌, వీర‌సింహారెడ్డి చిత్రాల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యేలా చేశారు. ఒక‌వేళ సంక్రాంతి పండిక్కి కాకుండా ఇంకెప్పుడు విడుద‌లైనా ఈ రెండు సినిమాల జాత‌కం మ‌రోలా ఉండేద‌ని సినీ ప్రియులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.