మెగా డాటర్ మరో సంచలన పోస్ట్..సోషల్ మీడియాను మడత పెట్టేసిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ పేరు ఈ మధ్యకాలంలో సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఆమె ఏ పోస్ట్ పెట్టిన కొద్ది క్షణాల్లోనే ఆది వైరల్ అయిపోతుంది. దీనికి ప్రధాన కారణం ఆమె వ్యక్తిగత జీవితంలో మనస్పర్థలు వచ్చాయనే వార్తలు రావటమే, గతంలో ఓ వ్యక్తిని ప్రేమించే పెళ్లాడిన శ్రీజ.. తర్వాత కొన్ని సంవత్సరాలకి అతనితో విడిపోయి.. త‌ర్వాత‌ చిరంజీవి ఫ్యామిలీ స్నేహితుడి కొడుకు అయినా కళ్యాణ్ దేవ్‌కి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు వీరిద్దరూ కూడా దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Kalyan dev |మెగా అల్లుడు కెరీర్ ముగిసినట్లేనా.. ఏం జరగబోతోంది..?

సోషల్ మీడియాలో కూడా వీరిద్దరూ పెట్టే పోస్టులు కూడా వారి మధ్య అనుమానాలకు తావు ఇస్తున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా శ్రీజ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కూడా ఎంత వైరల్ గా మారిందో. తర్వాత ఆమె రిలేషన్ షిప్ లో ఉన్నానంటూ పెట్టిన ఫస్ట్ కూడా అందరికీ షాక్ ఇచ్చింది.. చివరికి ‘ఐ యామ్‌ లవింగ్ ది రిలేషన్ షిప్ విత్ సెల్ఫ్ అంటూ’.. ‘మన సెల్ఫ్ లవ్ కంటే గొప్పది ఏది లేదన్నట్టుగా పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది’. ఈ మ‌ధ్య కాలంలో శ్రీజ సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్న త‌న‌పై గాసిప్స్ వచ్చే విధంగా పోస్టులు పెడతాం మాత్రం మానలేదు.

Chiranjeevi's daughter Sreeja will marry twice more?

తాజాగా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఒకటి షేర్ చేసింది. ఆ పోస్టులో తన ‘కాఫీ’ అలవాటు గురించి శ్రీజ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఆ పోస్టులో.. ‘నా అల్లరికి నా ప్రశాంతతను నాకు నువ్వే ఇస్తున్నావ్..జీవితంలో చీకటికి వెలుగు నింపుతావ్’.. ‘నేను ప్రతిరోజు ఉదయం లేస్తున్నానంటే దానికి ముఖ్య కారణం నువ్వే’.. ‘నా 14 ఏళ్ల వయసులో నువ్వు నాకు పరిచయం అయ్యావు. అప్పటినుంచి నువ్వు నాతోనేే ఉంటున్నావు.. థాంక్యూ మై డియర్ కాఫీ’ అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Sreeja (@sreejakonidela)