ఈ నలుగురు హీరోలు ఎవరు హిట్.. ఎవరు ఫట్…!

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో దివంగ‌త ఎన్టీఆర్‌, ఏఎన్నార్, వీరిద్ద‌రు త‌ర్వాత సూప‌ర్ స్టార్ కృష్ణ.. ఒక‌ప్పుడు సినిమా రంగ‌ని ఏలేశారు. వీరిలో ఎన్టీఆర్ ఉన్నంత వ‌ర‌కు ఆయ‌నే నెంబ‌ర్ వ‌న్‌గా ఉన్నారు. ఎన్టీఆర్ ఎప్పుడైతే రాజ‌కీయాల‌లోకి వెళ్ళారో… తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో నెంబ‌ర్ వ‌న్ ఎవ‌రు అనే ప్ర‌శ్న‌కు ఇద్ద‌రు హీరోల మ‌ధ్య ప్ర‌ధానంగా పోటీ న‌డిచింది. మోగాస్టార్ చిరంజీవి, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ 1980, 90వ ద‌శ‌కం మ‌ధ్య‌కాలంలో నెంబ‌ర్ వ‌న్ రాంక్‌ కోసం పోటీ ప‌డ్డారు. అయితే ఈ పోటీలో బాల‌య్య కంటే ఒక‌టి రెండు హిట్లు చిరంజీవికే వ‌చ్చాయి. అయితే 2000వ ద‌శ‌కం ప్రారంభంలో బాల‌య్య స‌మ‌ర‌సింహారెడ్డి – న‌రసింహానాయ‌డు, సినిమాల‌తో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టి త‌న స‌త్తా చూపాడు.

ఎన్టీయార్ ను చూసి ఏయన్నార్ తొలిసారి ఏమనుకున్నాడో తెలుసా | Unknown Facts About Ntr And Anr Details, Akkineni Nageswara Rao, Nandamuri Taraka Rama Rao, Tollywood Industry, Patalabhairavi Movie, Ntr Anr ...

ఇక చిరంజీవి, బాల‌కృష్ణ‌తో పాటు నాగార్జున‌, వెంక‌టేష్ కూడా స్టార్ హీరోలుగా కొన‌సాగుతు వ‌చ్చారు. ఈ న‌లుగురు స్టార్ హీరోలు సినీ ప‌రిశ్ర‌మ‌కు నాలుగు స్తంభాలుగా నిలిచారు. ప్ర‌స్తుతం యంగ్ హీరోల‌తో పోటీ ఉన్నా ఈ న‌లుగురు హీరోలు సినిమాల్లో న‌టిస్తూ త‌మ స‌త్తా చాటుతున్నారు. ఆరు ప‌దుల వ‌య‌సులోను యంగ్ హీరోల‌కు పోటీ ఇస్తున్నారు. అయితే ఈ న‌లుగురు హీరోల‌లో ఎవ‌రు టాప్ ర్యాంక్‌లో ఉన్నారు ?ఎవ‌రు ప్ర‌స్తుత ట్రెండ్‌కు అనుగుణంగా సినిమాలు చేయ‌లేక బేజారు అవుతున్నారు ఆ లెక్కేంటో చుద్దాం.

Chiranjeevi Balakrishna Nagarjuna Venkatesh: చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున రూట్లో వెంకటేష్.. ఇంతకీ ఏ విషయంలో అంటే.. | telugu senior Top hero Victory venkatesh follows nagarjuna balakrishna ...

చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ త‌మ వ‌య‌స్సుకు త‌గ్గ‌ట్టు సినిమాలు చేస్తున్నారు. అలా త‌మ మార్కెట్ పెంచుకుంటూ వెళుతున్నారు. కానీ నాగార్జున మాత్రం త‌న తోటి ముగ్గురు హీరోల కంటే వెనుకంజ‌లో ఉన్నాడ‌నే చెప్పాలి. నాగ‌ర్జున సినిమాల‌కు మినిమం ఓపెనింగ్స్ కూడా లేవు. ఒక్క బంగార్రాజు త‌ప్ప మిగిలిన సినిమాలు పెద్ద‌గా అక‌ట్టుకోలేదు. ఆఫీస‌ర్‌, మ‌న్మ‌థుడు 2, ఘోస్ట్‌ లాంటి సినిమాలు నాగ్ ప‌రువు తీసేశాయి. చిరంజీవి 10 ఏళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన క‌త్తి రీమేక్ ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో రు. 100 కోట్ల షేర్‌తో స‌త్తా చాటాడు.

Balakrishna and Chiranjeevi: When rivals turn into 'close friends'

సైరా సినిమా ప్టాప్ అయినా రూ.100 కోట్ల షేర్ రాబ‌ట్టింది. అయితే ఆచార్య మాత్రం చిరంజీవిని పూర్తిగా నిర‌రాశ‌ప‌రిచింది. కొర‌టాల శివ లాంటి క్రేజీ డైరెక్ట‌ర్‌, రామ్‌చ‌ర‌ణ్ ఉండి కూడ ఆచార్య ఇంత భారీ ఫ్లాప్ అవుతుంద‌ని ఎవ‌రు అనుకోలేదు. ఆచార్య త‌రువాత చిరంజీవి మార్కెట్ పూర్తిగా డౌన్ అయింది. పైగా చిరంజీవి వ‌రుస‌గా రీమేక్‌లు చేస్తున్నాడ‌ని… ఫామ్‌లో లేని డైరెక్ట‌ర్ల‌తోనే సినిమాలు చేస్తున్నాడ‌న్న అప‌వాదు ఉంది. కాని చిరు తాజాగా వరుస బ్యాక్ టు బ్యాక్ విజయాలతో తన రేంజ్‌ను మరోసారి టాలీవుడ్‌కు చూపించాడు. సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య తో బాక్స్ ఆఫీస్ షేక్ చేశాడు.

No worry for Venkatesh and Nagarjuna fans

ఇక బాల‌కృష్ణ త‌న కెరియ‌ర్ లోనే ఎప్పుడు లేనంత ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అటు వెండితెర‌ను షేక్ చేస్తూ…వ‌ర‌స‌గా క్రేజీ డైర‌క్ట‌ర్ల‌తో సినిమాలు చేస్తున్నాడు. ఇటు ఆన్ స్టాప‌బుల్ టాక్ షోతో బుల్లితెర‌పై త‌న విశ్వ‌రూపం చూపించి ఈతరం జ‌న‌రేష‌న్‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. అఖండ బాల‌య్య కెరియ‌ర్‌లోనే భారీ వ‌సూళ్లు సాధించింది. ఈ సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి సినిమాతో కూడా మరో బిగ్గెస్ట్ హిట్ నీ తన ఖాతాలోవేసుకుని తన విజయ దండయాత్రను కొనసాగిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత కూడా వరుస క్రేజీ డైరెక్టర్ తో మంచి లైన్ అప్ తో దూసుకుపోతున్నాడు.

Nandamuri Balakrishna Birthday Spl: Silver Legend .. Akhanda in acting .. Balayya Birthday Special

బాల‌య్య సినిమా వ‌స్తుందంటే ఇప్పుడు సినీ అభిమానుల్లో, ట్రేడ్ వ‌ర్గాల్లో మామూలు హైప్ ఉండ‌డం లేదు. మ‌రో సీనియ‌ర్ హీరో వెంక‌టెష్ త‌న వ‌య‌సుకు త‌గిన సినిమాల‌ను ఎంపిక చేసుకుంటూ.. ఇటు ఈ త‌రం హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమాల్లో న‌టిస్తూ… ప్ర‌యోగాత్మ‌క‌, క‌థాబ‌లం ఉన్న సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు. ఓవ‌రాల్‌గా ఈ న‌లుగురు సీనియ‌ర్ హీరోల్లో బాల‌య్య ముందంజ‌లో ఉండ‌గా… నాగ‌ర్జున
ఘోరంగా చ‌తికిల‌ప‌డుతున్న‌ట్టే ఉంది.