మారుతి చేతికి ప్రభాస్ రూ. 6 కోట్ల‌ కార్.. వైర‌ల్ గా మారిన వీడియో!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీకి `రాజా డీల‌క్స్‌` టైటిల్ ప‌రిశీల‌నలో ఉంది. ఇందులో నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాను హార్రర్ కామెడీ జానర్‌లో తెరకెక్కిస్తున్నారు.

రాజా డీల‌క్స్ అనే పాత థియేట‌ర్ చుట్టు ఈ సినిమా క‌థ న‌డుస్తుంది. ముందుగా ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. కానీ, ఫ‌స్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసి.. రెండో షెడ్యూల్ ను కూడా ప్రారంభించారు.

ఇక‌పోతే తాజాగా మారుతి ఓ లగ్జరీ కారులో స్టైలిష్ గా కూర్చొని పోజ్ ఇచ్చారు. అది ఆ కార్ మరెవరిదో కాదు ప్రభాస్ ది. ఆయ‌న ఎంతో ఇష్టంతో కొనుగోలు చేసిన లంబోర్గిని కారు అది. దాని విలువ రూ. 6 కోట్లు. అయితే ప్ర‌భాస్ ల‌గ్జ‌రీ కారులో మారుతి రై రైమంటూ చ‌క్క‌ర్లు కొట్టారు. అలాగే స్టైలిష్ గా ఫోటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం లంబోర్గిని మారుతి డ్రైవ్ చేస్తున్న వీడియో మ‌రియు ఆయ‌న స్టైలిష్ ఫోటో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

https://twitter.com/vishal_x_x_7/status/1619595582905135104?s=20&t=z_9A9gHGtlm4YLYHdWubEg