రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘అమిగోస్’ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు. ఈ సినిమాతో శాండిల్ వుడ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ మొదటిసారి తెలుగులో నటించినట్లయింది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నెని, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. అమిగోస్ సినిమాని ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ ఆషికా రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ సినిమాలో ఆమె జర్నీ గురించి, టాలీవుడ్ లో మొదటి సారి ఆమె వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అనే దాని గురించి వివరించారు.
ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ “నేను చిన్నప్పటినుండి తెలుగు సినిమాలు, పాటలు వింటూ ఉండటం వల్ల తెలుగు అర్ధమవుతుంది. ఇక ఇప్పుడు తెలుగులో వర్క్ చేయడం వల్ల నాకు తెలుగు నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడిప్పుడే సినిమాలో డైలాగ్స్ చెప్పడం వల్ల తెలుగు నేర్చుకోగలుగుతున్నా ” అని చెప్పారు. మీరు ఎప్పటినుండో నట్టిస్తున్నారు కదా, మరి తెలుగు ఇండస్ట్రీకి రావడానికి ఎందుకు ఇంత సమయం పట్టింది అని మీడియా వారు అడిగిన ప్రశ్నకు ఆషికా రంగనాథ్ ఆసక్తికరంగా కామెంట్స్ చేసింది.
ఆమె పై ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. “ఈ ప్రశ్న మీరు నన్ను కాదు, తెలుగు దర్శకులను అడగాలి, ఎందుకు ఇంతకాలం ఆ అమ్మాయిని తెలుగు ఇండస్ట్రీ లోకి తీసుకురాలేదు అని. అసలైతే టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి నాకు కొన్ని ఆఫర్స్ వచ్చాయి కానీ నాకు డేట్స్ ఖాళీ లేకపోవడం, ఇంకా కొన్ని కారణాలతో తెలుగు ఇండస్ట్రీ కి రావడానికి కాస్త టైమ్ పట్టింది ” అని ఆమె వివరించారు.