ఆఫ‌ర్ల కోసం కీర్తి సురేష్ పాట్లు.. ఆఖ‌రికి అక్క‌డా చూపించేస్తుంది!

మహానటి సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ కీర్తి సురేష్ ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసింది. కానీ సరైన హిట్టు మాత్రం పడలేదు. కెరీర్ డేంజర్ జోన్ లో పడుతుంది అనుకుంటున్న‌ సమయంలో `సర్కారు వారి పాట` సినిమాతో కీర్తి సురేష్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. అయితే ఈ మూవీ మంచి విజ‌యం సాధించినప్పటికీ టాలీవుడ్ లో కీర్తి సురేష్ కు ఆఫర్లు అంతంత మాత్రమే ఉన్నాయి.

దీంతో ఆఫర్ల కోసం కీర్తి సురేష్ నానా పాట్లు పడుతోంది. ముఖ్యంగా గ్లామర్ తో దర్శక నిర్మాతలను ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్నిస్తోంది. కెరీర్‌ ఆరంభం నుంచి కీర్తి సురేష్ గ్లామర్ షో కి చాలా దూరంగా ఉంది. కానీ సర్కారీ వారి పాట తర్వాత సీన్ మారిపోయింది. సోషల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉంటూ గ్లామ‌ర‌స్ ఫోటోషూట్లతో రచ్చ రచ్చ చేస్తుంది. ఆఖరికి కమర్షియల్ యాడ్స్ లో సైతం అందాలు ఆడబోయటంలో ఏమాత్రం తగ్గడం లేదు.

దీంతో యాడ్స్ లో కూడా ఇంతలా అందాలు ఆర‌బోయాలా అంటూ నెటిజ‌న్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరు మాత్రం మహానటి వెరీ క్యూట్, సో హాట్ అంటూ పొగుడుతున్నారు. ఇకపోతే కీర్తి సురేష్ చేతిలో `దసరా` సినిమా మాత్రమే ఉంది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. మార్చి 30 ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది.