ప్రస్తుతం `దసరా` అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్న న్యాచురల్ నాని.. న్యూ ఇయర్ సందర్భంగా తన తదుపరి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. నాని కెరీర్ లో తెరకెక్కబోయే 30వ సినిమా ఇది. డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. సను జాన్ వర్గీస్ ఐఎస్సీ కెమెరామెన్‌గా, పాపులర్ మలయాళం కంపోజర్ హెశమ్ అబ్దుల్ వహబ్ సంగీత దర్శకుడిగా పని చేయబోతున్నారు.
అలాగే ఈ సినిమాలో నానికి జోడీగా `సీతారామం` బ్యూటీ మృణాల్ ఠాకూర్ గా ఫిక్స్ అయింది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ నిర్మిస్తున్నారు. తండ్రీకూతుళ్ల రిలేషన్ షిప్ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ వీడియోతో స్పష్టంగా తేలిపోయింది.
త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు మృణాల్ అందుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. `సీతారామం` సినిమాకు రూ. 50 లక్షల రేంజ్ లో రెమ్యునరేసన్ అందుకున్న మృణాల్.. నాని సినిమాకు ఏకంగా రూ. కోటి పుచ్చుకుంటుందని జోరుగా టాక్ నడుస్తోంది. ఏదేమైనా రెండో సినిమాకే మృణాల్ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం టాలీవుడ్ నిర్మాతలను ఆశ్చర్యపరుస్తోంది.