న్యూ ఇయర్ వేడుకల్లో జనాలు తడిసి ముద్దయ్యారు. ఇక సినిమా సెలిబ్రిటీల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో హీరోయిన్ మెహ్రీన్ కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పేందుకు ఇండియా వేస్టని అనుకుందేమోగాని మిత్రులతో కలిసి దుబాయ్ వెళ్ళింది. ఈ సందర్భంగా అక్కడ తీసుకున్న సెలెబ్రేషన్స్ తాలూక ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. దాంతో ఆమె ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెహ్రీన్ టెంప్టింగ్ గ్లామర్ కి కుదేలవుతున్న కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.
తమన్నాకి చెల్లిలాగా ఉందని ఒకరంటే, అందాల విందు సరేగాని కొత్త సినిమా కహాని ఏమిటో ముందు చెప్పు అని కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మెహ్రీన్ సినిమా కెరీర్ ప్రస్తుతం అంత ఆశాజనకంగా లేదని చెప్పుకోవాలి. మెహ్రీన్ లేటెస్ట్ రిలీజ్ ఎఫ్3 బాగానే వుంది అనిపించుకున్నప్పటికీ జనాలను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఓపెనింగ్స్ భారీగా రాబట్టిన ఎఫ్3 తరువాత తరువాత నెమ్మదించింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ క్రమంలో ఎఫ్3 బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. మూవీపై ఉన్న క్రేజ్ రీత్యా అధిక ధరలకు ఎఫ్3 హక్కులు విక్రయించారు.
దీంతో ఎఫ్3 డిస్ట్రిబ్యూటర్స్ కి స్వల్పంగా నష్టాలు మిగిలిచినట్లు సమాచారం. అలాగే ఈమె స్పా పేరుతో ఓ తెలుగు మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో విక్రాంత్ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం చిత్రీకరణ తాజాగా మొదలైంది. అలాగే కన్నడలో ఓ డెబ్యూ సినిమా చేయబోతోంది. ఇక ఆమె సినిమాల జోరు తగ్గడానికి 2021లో భవ్య బిష్ణో తో ఎంగేజ్మెంట్ జరుపుకోవడమే అని తెలుస్తోంది. కాకపోతే తరువాత అనూహ్యంగా వీరు తమ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. దాంతో ఆమె మరలా సినిమా కెరీర్ మీద దృష్టి సారించారు. అదే క్రమంలోనే ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు.