భర్త నాగ చైతన్య నుంచి విడిపోయిన అనంతరం సమంత కెరీర్ పరంగా యమా జోరు చూపించింది. భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టింది. ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్ట్ లను కొన్నిటిని పూర్తి చేసింది. మిగతా వాటిని కంప్లీట్ చేసే లోపే ఆమె మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైంది.
ఈ వ్యాధి కారణంగా సమంత గత కొద్ది నెలల నుంచి ఇంటికే పరిమితం అయింది. అయితే తాజాగా ఆ బ్యూటీకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ అమ్మడు ఓ బిగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. `ఫ్యామిలీ మ్యాన్-2` తర్వాత రాజ్, డీకే దర్శకత్వంలోనే మరో యాక్షన్ వెబ్ సీరిస్‌కు సమంత గ్రీన్ సిగ్నల్ చెప్పింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సిరీస్ లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంత జంటగా కనిపించబోతున్నారు.
1990 బ్యాక్ డ్రాప్ లో సాగనున్న ఈ సిరీస్ ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. కానీ, సమంత షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఇప్పట్లో కనిపించడం లేదు. ఇక షూటింగ్ ఆలస్యం అవుతుందన్న కారణంగా సమంత ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందంటూ టాక్ నడుస్తోంది. కాగా, గతంలో అనారోగ్యం కారణంగా కొన్ని సినిమాల నుంచి సమంత తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలు వదంతులే అని సమంత టీమ్ కొట్టిపారేసింది. కానీ, ఇప్పుడు ఆ వదంతులే నిజం అయ్యాయని అంటున్నారు.