కొడాలికి ఎదురులేనట్లేనా..గుడివాడలో టీడీపీకి డౌటే?

గుడివాడలో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ గెలుపు అవకాశాలు కనిపించడం లేదా? ఈ సారి కూడా కొడాలి నాని సత్తా చాటడం ఖాయమేనా? ప్రస్తుతం గుడివాడలో జరుగుతున్న రాజకీయం బట్టి చూస్తే ఈ సారి కొడాలి గెలుపు మాత్రం అంత సులువు కాదనే చెప్పాలి. గత రెండు ఎన్నికల మాదిరిగా ఈజీగా కొడాలి గెలవడం కష్టమే. కాకపోతే ఇప్పటికీ గుడివాడలో కొడాలి లీడ్ లోనే ఉన్నారని తెలుస్తోంది. ఆ ఆధిక్యాన్ని తగ్గించగలిగితేనే..గుడివాడలో టి‌డి‌పి గెలవగలదు.

ఈ మధ్య వచ్చిన పలు సర్వేల్లో గుడివాడలో కొడాలికే లీడ్ ఉందని చెబుతున్నాయి. అదే సమయంలో తాజాగా ఐప్యాక్ పేరుతో ఓ సర్వే సోషల్ మీడియాలో లీక్ అవుతుంది. ఆ సర్వేలో కూడా గుడివాడలో కొడాలి లీడ్ లో ఉన్నారని తేలింది. ఆ సర్వేలో ఎంత నిజముందో తెలియదు గాని..గుడివాడలో మాత్రం కొడాలికి పట్టు తగ్గలేదా? అనే పరిస్తితి. పైగా టి‌డి‌పిలో ఎవరు నిలబడతారనేది తెలియకుండా ఉంది. ఉండటానికి రావి వెంకటేశ్వరరావు టి‌డి‌పి ఇంచార్జ్ గా ఉన్నారు.

కానీ రావికి పోటీ గా పలువురు నేతలు గుడివాడ సీటు కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పటికే ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము..గుడివాడలో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆయన కూడా సీటు కోసం ట్రై చేస్తున్నారని తెలిసింది. ఇంకా పలువురు నేతలు ఉన్నారు. అయితే అంతా కలిసికట్టుగా పనిచేస్తేనే గుడివాడలో కొడాలిని ఎదురుకోగలరు. అలా కాకుండా ఎవరికి వారు గ్రూపు రాజకీయం చేస్తే గుడివాడలో టి‌డి‌పికి ఎదురుదెబ్బ తప్పదు.

ఇప్పుడున్న పరిస్తితుల్లో కొడాలికి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ..అలా టి‌డి‌పి లీడర్లలో పెద్దగా ఎవరికి మాస్ ఫాలోయింగ్ లేదు. కాబట్టి గుడివాడలో కొడాలిని ఓడించడం మాత్రం అంత ఈజీ కాదని తెలుస్తోంది.