హనీరోజ్.. ఈ మలయాళ కుట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇటీవల ఈ భామ సంక్రాంతికి విడుదలైన `వీర సింహారెడ్డి`లో మెరిసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణకు మరదలుగా మరియు తల్లిగా నటించి అదరగొట్టింది. శృతి హాసన్ కంటే ఈ చిత్రంలో హనీరోజ్ పాత్రే ఎక్కువ హైలెట్ అయింది.
మొత్తానికి వీర సింహారెడ్డి మూవీతో హనీరోజ్ కావాల్సినంత క్రేజ్ సంపాదించుకుంది. చాలా మంది ఆమెను క్రష్ లిస్టులో కూడా చేర్చేసుకుంటున్నారు. అయితే హనీరోజ్ కు తెలుగులో ఇదే మొదటి చిత్రం అని అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. హనీరోజ్ దాదాపు 14 ఏళ్ల క్రితమే తెలుగులో హీరోయినగా నటించింది. 2008లో శివాజీ హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన `ఆలయం` సినిమాలో హనీరోజ్ హీరోయిన్ గా నటించింది.
అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత 2014లో ఈ వర్షం సాక్షిగా అనే సినిమా కూడా చేసింది. అది కూడా ఆమెను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేయలేకపోయింది. దాంతో మలయాళంలో సినిమాలు చేస్తూ అక్కడ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక 9 ఏళ్ల తర్వాత మళ్లీ `వీర సింహారెడ్డి`తో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే 14 ఏళ్ల క్రితం హనీరోజ్ ఫోటోలను చూసి చాలా మంది గుర్తుపట్టలేకపోతున్నారు. ఎందుకంటే, అప్పటికీ, ఇప్పటికీ హనీరోజ్ లో ఎన్నో మార్పలు వచ్చాయి.