ఇంట్రెస్టింగ్: పవన్- బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ వచ్చేది ఆ రోజే..!

తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త విషయాలను పరిచయం చేయడంలో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ముందు వరుసలో ఉంటాడు. ఈ క్రమంలోనే తొలి తెలుగు ఓటీటీ యాప్ ఆహాను ప్రారంభించి ఎప్పటికప్పుడు సరికొత్త క్రియేటివ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. మరి అలా నట సింహం నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా ఓ టాక్ షోని కూడా ప్రారంభించి అందరితో అధ‌రహో అనిపించాడు.

ఇప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాప్పబుల్ టాక్ షో ఇండియాలోనే నెంబర్ 1 టాక్‌ షో గా మారిపోయింది. ఇప్పటికే తొలి సీజన్ ను కంప్లీట్ చేసుకుని రెండో సీజన్ కూడా చివరి దశకు వచ్చింది. ఈ సీజన్‌లో కూడా బాలకృష్ణ అదిరిపోయే రీతిలో అదరగొడుతున్నాడు.ఇప్పటికే ఈ సీజన్ లో మొదటి సీజన్ ను మించి మరింత మంది బిగ్ స్టార్స్ బాలయ్యతో సందడి చేశారు. రీసెంట్ గా ఈ షోలో బాలయ్య- ప్రభాస్ ఎపిసోడ్ కూడా ఆహాలో స్ట్రీమింకు రాగా ఈ ఎపిసోడ్ కు అదిరిపోయే రీతిలో వ్యూస్ వచ్చాయి.

Pawan Kalyan shoots with Nandamuri Balakrishna for Unstoppable With NBK.  Leaked pics, videos - India Today

ఇక ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సెన్సేషనల్ ఎపిసోడ్ ని ప్లాన్ చేశారు. మరి ఇంత మంచి హైప్ ఉన్నా ఈ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. తాజా అప్డేట్ ప్రకారం ఈ ఎపిసోడ్ వచ్చేనెల 3 తేదీన ఆహా లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక మరి దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.