అందాల చందమామ కాజల్ అగర్వాల్ సౌత్ లో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. సౌత్ స్టార్ హీరోలతో జత కట్టింది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయన్ల జాబితాలో స్థానాన్ని సంపాదించుకుంది. కానీ, ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. కాజల్ కు పెళ్లి అయింది. గత ఏడాది ఒక బాబుకు జన్మనిచ్చి తల్లి అయింది. అయితే తల్లి అయిన తర్వాత కూడా కాజల్ కు హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయి. కానీ, […]
Tag: latest new
ఒకే వేదికపై స్టార్ హీరోలు…బాలయ్య బాబు ఎందుకు మిస్ అయ్యాడు…!
స్టార్ హీరోలు అందరూ కలిసి ఒకే వేదికపై కనిపించడం అనేది ఎంతో అరుదుగా జరిగే సంఘటన. అభిమానులందరూ తమకు ఇష్టమైన హీరోలందరినీ కలిసి చూడాలని ఆశపడుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఇప్పటి తరం హీరోలు మాత్రమే కాకుండా సీనియర్ హీరోలు కూడా ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇప్పటి తరం హీరోలతో పోటీ పడుతూ.. తమ […]
14 ఏళ్ల క్రితం హనీరోజ్ ఎలా ఉందో చూశారా? అస్సలు గుర్తుపట్టలేరు!
హనీరోజ్.. ఈ మలయాళ కుట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇటీవల ఈ భామ సంక్రాంతికి విడుదలైన `వీర సింహారెడ్డి`లో మెరిసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణకు మరదలుగా మరియు తల్లిగా నటించి అదరగొట్టింది. శృతి హాసన్ కంటే ఈ చిత్రంలో హనీరోజ్ పాత్రే ఎక్కువ హైలెట్ అయింది. మొత్తానికి వీర సింహారెడ్డి మూవీతో హనీరోజ్ కావాల్సినంత క్రేజ్ సంపాదించుకుంది. చాలా మంది ఆమెను క్రష్ లిస్టులో కూడా చేర్చేసుకుంటున్నారు. […]
మహేష్ సినిమాకోసం బన్నీ కూతురుని అడిగారట… ‘సితార’ ఆ పాత్రకి సరిపోదా?
వింటేనే ఆశ్చర్యం వేస్తోంది కదా. ప్రిన్స్ మహేష్ బాబు గారాల పట్టీ సితార ఉండగా, మహేష్ బాబు సినిమా కోసం బన్నీ కూతురుని అడగడమేమిటి? అనే అనుమానం కలుగక మానదు. ఆ విషయం తెలియాలంటే మీరు ఈ కథను చదవాల్సిందే. మహేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మహేష్ కెరీర్ లో తెరకెక్కబోయే 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `SSMB 28` వర్కింగ్ టైటిల్ తో ఈ […]
రెండేళ్ళ వరకూ అమీర్ ఖాన్ సిల్వర్ స్క్రీన్ పైన కనబడడట… కారణం ఇదేనా?
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. అతగాడు సినిమా చేసాడంటే దానికొక ప్రత్యేకత ఉంటుంది. లేకపోతే అతను అస్సలు చేయనే చేయదు. అదే విషయం బాలీవుడ్లో అతనిని ప్రధమ స్థానంలో ఉంచింది. అయితే అమర్ ఖాన్ ఇటీవల చేసిన సినిమా ‘లాంగ్ సింగ్ చద్దా’ సినిమా బాగున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాలవలన సరిగ్గా ఆడలేదు. ఈ క్రమంలో ఈ స్టార్ కాస్త విరామం తీసుకోవాలని యోచిస్తున్నాడు.. ఎప్పుడూ పని, పని, పనీ […]
వామ్మో..పీవీ సింధు అన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తుందా..?!
తెలుగుతేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు..జాతీయ, అంతర్జాతీ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కాంస్యం చేజిక్కించుకుంది. నిన్న తార హి బింగ్జియావోతో జరిగిన పోరులో సింధు స్థాయికి తగిన ఆటతీరుతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. తాజా విషయంతో వరుసగా ఒలింపిక్స్ లో రెండు పతకాలను సాధించిన తొలి భారత మహిళ అథ్లెట్ గా […]