బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. అతగాడు సినిమా చేసాడంటే దానికొక ప్రత్యేకత ఉంటుంది. లేకపోతే అతను అస్సలు చేయనే చేయదు. అదే విషయం బాలీవుడ్లో అతనిని ప్రధమ స్థానంలో ఉంచింది. అయితే అమర్ ఖాన్ ఇటీవల చేసిన సినిమా ‘లాంగ్ సింగ్ చద్దా’ సినిమా బాగున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాలవలన సరిగ్గా ఆడలేదు. ఈ క్రమంలో ఈ స్టార్ కాస్త విరామం తీసుకోవాలని యోచిస్తున్నాడు.. ఎప్పుడూ పని, పని, పనీ అయితే అది ఎంత ఇష్టమైన పని అయినప్పటికీ జీవితం బోర్ కొట్టేస్తుంది.
ఇండియాలో ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోలు చాలా అరుదుగా వుంటారు. అందులో ఎప్పుడూ ముందుంటాడు అమీర్. కమర్షియల్ సినిమాలు చాలా అరుదుగా చేస్తుంటాడు. డబ్బుతో సంబందం లేకుండా.. సినిమాల పర్ఫెక్ట్ గా వస్తే చాలా సంతృప్తి పడతాడు అమీర్. ఆయన చేసిన దంగల్ సినిమా ప్రపంచ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మైలురాయి అని అనుకోవాలి. అయితే లాల్ సింగ్ చడ్డా ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసారు. కానీ ఈ సినిమా అమీర్ఖాన్కు తీవ్ర నిరాశనే మిగిల్చింది. నిర్మాతలకు కోట్లలో నష్టాలను తెచ్చిపెట్టింది. అందుకే నెక్ట్స్ సినిమాల విషయంలో నిర్ణయాలను మార్చుకున్నట్టు సమాచారం.
ఇకపోతే అమీర్ ఖాన్ ప్రస్తుతం చాంపియన్స్ అనే సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆ సినిమాలో అమీర్ నటించడం లేదు. కేవలం నిర్మాణ బాధ్యతలను మాత్రమే చూసుకుంటున్నారు. అంతేకాకుండా ఓ రెండేళ్లు సినిమాలకు విరామం తీసుకుని తన ఫ్యామిలీతో గడపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా తన తల్లితో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నారట. అనారోగ్యంతో రీసెంట్ గా హాస్పిటల్ లో చేరింది అమీర్ తల్లి. అందుకే ఆమె పక్కనే ఉండి… చూసుకోవాలి అని అమీర్ ఇంటర్వ్యూలో చెప్పాడు.