వింటేనే ఆశ్చర్యం వేస్తోంది కదా. ప్రిన్స్ మహేష్ బాబు గారాల పట్టీ సితార ఉండగా, మహేష్ బాబు సినిమా కోసం బన్నీ కూతురుని అడగడమేమిటి? అనే అనుమానం కలుగక మానదు. ఆ విషయం తెలియాలంటే మీరు ఈ కథను చదవాల్సిందే. మహేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మహేష్ కెరీర్ లో తెరకెక్కబోయే 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `SSMB 28` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ప్రారంభించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిందని తెలుస్తోంది. కాగా ఇంతలో మహేష్ ఫ్యామిలీలో వరుస మరణాలు చోటు చేసుకోవడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ స్క్రిప్ట్ ని మరింత పగడ్బంధీగా మార్చేశాడని చెప్పుకుంటున్నారు. తరువాతి షెడ్యూల్ సంక్రాంతి అనంతరం ఉండబోతుందని టాక్. ఇకపోతే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
అదేమంటే అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ నటించబోతుందనేది సారాంశం. ఇది నిజంగా ఫ్యాన్స్ ఊహించని సర్ప్రైజ్ అనే చెప్పుకోవాలి. ఈ న్యూస్ విని అల్లు వారి అభిమానులు సంతోష పడితే, ఘట్టమనేని అభిమానులు మాత్రం సితార అయితే బావుంటుంది కదాని ఫీల్ అవుతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. విషయం ఏమంటే అల్లు అర్హ, సితార మధ్య వయసు వ్యత్యాసం ఉంటుంది. పాత్ర పరంగా అయితే అర్హ దానికి సరిపోతుందని మేకర్స్ ఫీల్ అయ్యారట. అయితే ఇది ఎంత వరకు నిజం అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.