ఫైన‌ల్‌గా ఓ ఇంటిది కాబోతున్న శ్రీ‌ముఖి.. కోటీశ్వరుడినే ప‌ట్టేసింది!?

బుల్లితెర రాముల‌మ్మ‌, ప్ర‌ముఖ స్టార్ యాంక‌ర్ శ్రీ‌ముఖి ఓ ఇంటిది కాబోతోంది. వ‌య‌సు మూడు ప‌దుల‌కు చేరువ‌వ‌డంతో.. ఈ అందాల భామ మ‌న‌సు పెళ్లిపై మ‌ళ్లింది. ఈ ఏడాడే ఓ కోటీశ్వ‌రుడితో శ్రీ‌ముఖి పెళ్లి పీట‌లెక్క‌బోతుంద‌ట‌. బుల్లితెర‌పై దాదాపు అర డ‌జ‌న్ షోల‌తో యాంక‌ర్ గా ఫుల్ బిజీగా ఉన్న శ్రీ‌ముఖి.. ఒక బడా బిజినెస్ మేన్ తో గ‌త కొంత కాలం నుంచి ర‌హ‌స్యంగా ప్రేమాయ‌ణం న‌డిపిస్తుంద‌ట‌.

ఇప్పుడు వీరు త‌మ బంధాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లాల‌నే ఉద్ధేశంతో పెళ్లికి సిద్ధం అయ్యార‌ట‌. ఇరు కుటుంబ‌స‌భ్యులు కూడా వీరి పెళ్లి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. అలాగే ఇటీవ‌ల రెండు కుటుంబాలు వివాహం గురించి మాట్లాడుకున్నాయని.. ముహూర్తాన్ని ఖ‌రారు చేయడమే మిగిలిందని అంటున్నారు.

2023 ఆరంభంలోనే శ్రీ‌ముఖి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని.. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం వెలువడనుంద‌ని గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక శ్రీముఖిని పెళ్లాడ‌బోయేవాడు బడా వ్యాపారవేత్త అట. కోట్లకు పడగలెత్తిన బిగ్ షాట్ ఇంటికి శ్రీముఖి కోడ‌లిగా వెళ్ల‌బోతుంద‌ని అంటున్నారు.