హిట్ కోట్టిన ఆనందమే లేదు.. అనుపమ లాంటి పరిస్ధితి పగ వాడికి కూడా రాకూడదు రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడు తారుమారవుతాయో ఎవరికీ అర్థం కాదు . స్టార్ హీరోగా ఉన్న పర్సన్ జీరో గా మారడం.. ఎటువంటి హిట్ ట్రాక్ లేని హీరో స్టార్ గా మారడం ..రాత్రికి రాత్రి జరిగిపోతూ ఉంటాయి . అలా ఇండస్ట్రీలో జరిగిన మాయలకే అనుపమ పరమేశ్వరణ్ వరుసగా బ్యాక్ టూ బ్యాక్ మూడు హీట్లను తన ఖాతాలో వేసుకుంది . నిన్న మొన్నటి వరకు సరైన హిట్ కొట్టలేదు అంటూ ఆమెను ట్రోల్ చేసిన జనాలే అనుపమ పరమేశ్వరణ్ ని ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరోయిన్ అంటూ ట్యాగ్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరణ్ పేరు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసిందే యంగ్ హీరో నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా తెరకెక్కిన సినిమా కార్తికేయ 2 ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా తెలుగు చలనచిత్ర పరిశ్రమ రికార్డును తిరగరాసింది . ఈ తర్వాత వెంటనే మరోసారి యంగ్ హీరో నిఖిల్ తో జతకడుతూ 18 పేజీస్ అంటూ మరో సినిమాను రిలీజ్ చేసింది. ఆశ్చర్యం ఏంటంటే ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా కూడా కూల్ అండ్ క్లాసిక్ హిట్టుగా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ నమోదు చేసుకుంది. ముచ్చటగా మూడోసారి నేరుగా ఓటీటీలో బటర్ ఫ్లై అనే సినిమాతో తన లక్ ని పరీక్షించుకుంది అనుపమ పరమేశ్వరన్ .

కాగా ఎటువంటి మేల్ డామినేషన్ లేకుండా ఫిమేల్ లీడ్ తోనే లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ గా హిట్టును తన ఖాతాలో వేసుకుంది అనుపమ పరమేశ్వరన్. ఈ దెబ్బకి ఆమె రేంజ్ మారిపోతుందని అంత అనుకున్నారు. అయితే అనుపమ పరమేశ్వరణ్ తన ఖాతాలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. స్టార్ హీరోస్ కూడా అనుపమ పరమేశ్వరన్ తో సినిమాలు చేసేందుకు రెడీగా లేరు . దానికి మెయిన్ రీజన్ అనుపమ పరమేశ్వరన్ పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ టాక్ వినిపిస్తుంది .

మనకు తెలిసిందే ఇండస్ట్రీలో పద్ధతిగా నటించే హీరోయిన్స్ చాలా తక్కువ . అందులో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరణ్ నిలుస్తుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో మరో సాయి పల్లవి అంటూ ట్యాగ్ కూడా వేసుకునింది. దీంతో హిట్ కొట్టిన సరే అనుపమ పరమేశ్వరన్ కు ఆ ఆనందమే లేకుండా పోయింది అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే అనుపమ పరమేశ్వరణ్ తను పెట్టుకున్న రూల్స్ లో కొన్ని బ్రేక్ చేస్తే స్టార్ హీరోలు అవకాశాలు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు..!!