తెలుగుతేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు..జాతీయ, అంతర్జాతీ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కాంస్యం చేజిక్కించుకుంది. నిన్న తార హి బింగ్జియావోతో జరిగిన పోరులో సింధు స్థాయికి తగిన ఆటతీరుతో ప్రత్యర్థిని చిత్తు చేసింది.
తాజా విషయంతో వరుసగా ఒలింపిక్స్ లో రెండు పతకాలను సాధించిన తొలి భారత మహిళ అథ్లెట్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే..దేశంలోనే అత్యంత విలువైన మహిళా ప్లేయర్ గా పేరుగాంచిన సింధు కోసం ఇటు జాతీయ, అటు అంతర్జాతీయ వ్యాపార సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పీవీ సింధు ఓ వైపు బ్యాడ్మింటన్ ఆటతో పాటు మరోవైపు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈమె ప్రమోట్ చేస్తున్న బ్రాండ్లను గమనిస్తే..
వీసా, యోనెక్స్, స్టే ఫ్రీ, ఫ్లిప్‌కార్ట్, గాటోరేడ్, మూవ్, బూస్ట్, బ్రిడ్జ్‌స్టోన్ ఇండియా, నోకియా, పానాసోనిక్, రెక్కిట్ బెంకైసెర్, అపిస్ హిమాలయ హనీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఓజస్వితతో సహా దాదాపు ఇరవై బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఇక ఇఫ్పుడు టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో సింధు కాంస్యం గెలుచుకోవడంతో.. ఈమె లిస్ట్‌లో మరిన్ని బ్రాండ్ల వచ్చి చేరే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.