శ్రీ‌లీల ముందు ప‌రువు పోగొట్టుకున్న కాజ‌ల్‌.. మ‌రీ అంత దారుణం చేశారా?

అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ సౌత్ లో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. సౌత్ స్టార్ హీరోల‌తో జ‌త క‌ట్టింది. అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరోయ‌న్ల జాబితాలో స్థానాన్ని సంపాదించుకుంది. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మొత్తం మారిపోయింది. కాజ‌ల్ కు పెళ్లి అయింది. గ‌త ఏడాది ఒక బాబుకు జ‌న్మ‌నిచ్చి త‌ల్లి అయింది.

అయితే త‌ల్లి అయిన త‌ర్వాత కూడా కాజ‌ల్ కు హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. కానీ, మునుప‌టిలా రెమ్యున‌రేష‌న్ మాత్రం ఇవ్వ‌డం లేద‌ట‌. పెళ్లికి ముందు ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ పుచ్చుకున్న కాజ‌ల్ కు ఇప్పుడు రూ. కోటి ఇచ్చేందుకు కూడా నిర్మాత‌లు ముందుకు రావ‌డం లేదు. ప్ర‌స్తుతం కాజ‌ల్ నంద‌మూరి బాల‌కృష్ణ‌తో `ఎన్‌బీకే 108`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

ఇందులో కాజ‌ల్ హీరోయిన్ గా న‌టిస్తుంటే.. యంగ్ బ్యూటీ శ్రీ‌లీల కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. శ్రీ‌లీల‌ ఈ సినిమాకు రూ. 2 కోట్ల రేంజ్ లో పారితోషికం తీసుకుంటుంటే.. కాజ‌ల్ కు కేవ‌లం రూ. 75 ల‌క్ష‌లు ఇస్తున్నార‌ట‌. నిన్న‌గాక మొన్న వ‌చ్చిన‌ శ్రీలీల కి అంత డబ్బులిచ్చి.. కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్ కి అంత తక్కువ రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డం నిజంగా దారుణ‌మ‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. రెమ్యున‌రేష‌న్ విష‌యంలో శ్రీ‌లీల ముందు కాజ‌ల్ ప‌రువు పోగొట్టుకుంద‌ని కామెంట్లు చేస్తున్నారు.