మన తెలుగు చిత్ర పరిశ్రమకి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఎలాగో.. కన్నడ చిత్ర పరిశ్రమకి పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. కన్నడ అగ్ర నటుడు కంఠీరవ రాజ్ కుమార్ చిన్న కొడుకు గా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి అనతి కాలంలోనే ఆగ్ర హీరోగా మారాడు. కన్నడ పరిశ్రమలో అప్పు అని ప్రేమగా పిలుస్తారు. వరుస విజయాలు అందుకుని కన్నడ చిత్ర పరిశ్రమలో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న పునీత్ రాజ్ కుమార్ సినిమా వస్తుందంటేనే కర్ణాటక మొత్తం పండగ వాతావరణం నెలకొంటుంది.
పునీత్‌కు వచ్చినంత ఓపెనింగ్ కలెక్షన్స్ కర్ణాటకలో ఏ హీరోకి కూడా రావు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి ఈ అగ్ర నటుడు అకస్మాత్తుగా జిమ్ చేస్తూ రెండేళ్ల క్రితం గుండెపోటుతో మరణించిన విషయం యావత్తు సినీ ప్రపంచాన్ని శోక సముద్రంలోకి నెట్టేసింది. చనిపోయే ముందు రోజు కూడా అన్న శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ‘భజరంగి 2 ‘ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి సరదాగా చిందులు కూడా వేశాడు.
మరుసటి రోజు ఉదయానికే పునీత్ రాజ్ కుమార్ మరణించడం ఆయన కుటుంబ సభ్యులతో పాటు కోట్లాదిమంది అభిమానులను ఒక్కసారిగా బాధించింది. పునీత్ రాజ్ కుమార్ సినిమాలతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసేవాడు, ఎందరో అనాధ పిల్లలను చదివిస్తూ, అనాధలను మరియు వృద్ధులను కూడా తన దగ్గరికి తీసుకునేవాడు.. వారి కోసం ఎన్నో అనాధ శరణాలయాలను కూడా కట్టించాడు.. అలాంటి ఈ సేవ మూర్తి చివరికి తాను చనిపోయిన తర్వాత కూడా తన నేత్రాలను దానం చేసి గొప్ప మనసును చాటుకున్నాడు.
ఈ విషయం ఎలా ఉంచితే పునీత్ రాజ్ కుమార్ తెలుగు హీరోలతో కూడా ఎంతో స్నేహంగా ఉండేవారు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా అందరు హీరోలు ఆయనతో మంచి స్నేహం చేసేవారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కూడా రెండు మూడు సార్లు కలిశాడు. జానీ సినిమా షూటింగ్ సమయంలో పవన్‌ను రామోజీ ఫిలిం సిటీ లో పునీత్ కలిశాడు. పవన్- పునీత్ రాజ్ కుమార్ నటించిన చిన్ననాటి సినిమాల గురించి మాట్లాడుతూ ఆయన్ని ప్రశంసనించారని పునీత్ రాజ్ కుమార్ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు.
అయితే పునీత్ రాజ్ కుమార్ కోసం పవన్ కళ్యాణ్ ఓ గొప్ప పని చేశాడనే విషయం చాలామందికి తెలియదు. ఆయన ఇన్నీ సేవా కార్యక్రమాలు చేస్తాడని ఆయన చనిపోయే అంతవరకు ఎవరికీ తెలియదు.. కుటుంబ సభ్యులకు కూడా వీటి గురించి తెలియదు. పవన్ కళ్యాణ్ కూడా అందరిలాగానే ఈ విషయం తెలిసిందట, అప్పుడు పునీత్ రాజ్ కుమార్ నడుపుతున్న స్కూల్స్‌కి తనవంతుగా రూ.30 లక్షలకు పైగా విరాళం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా తన సేవా హృదయాన్ని చాటుకున్నాడు పవన్.