ORMAX: టాలీవుడ్ లో మళ్లీ నెంబర్ వన్ హీరో ఇతనే..?

టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడు ప్రభాస్ మొట్టమొదటిగా ఈశ్వర్ సినిమాలో నటించి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత వర్షం సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుతున్నారు హీరో ప్రభాస్..ప్రస్తుతానికి పాన్ వరల్డ్ స్థాయి ప్రాజెక్టులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే నిర్మాతలు ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు..

Image

ఇప్పట్లో ఈ స్టార్ హీరోని నమ్మి దాదాపు రూ .2000 కోట్లు రేంజ్ లో ఖర్చు చేస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమాలకు రూ.400 కోట్లు రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతుండటంతో నిర్మాతలకు ఊహించని స్థాయిలో లాభాలు వస్తున్నాయి. చివరిగా బాహుబలి చిత్రంతో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారు ఆ తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి.

తాజాగా ఓర్మాక్స్ సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. ఆ సర్వేలో ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచాడు. ఇలా ప్రభాస్ మొదటి స్థానంలో నిలవడంతో ప్రభాస్ అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. ప్రభాస్ మొదటి స్థానంలో నిలవగా రెండో స్థానంలో రామ్ చరణ్ నిలిచాడు.మూడవ స్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్ దక్కించుకున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాలుగో స్థానంలో నిలిచాడు. మహేష్ బాబు ఐదో స్థానంలో నిలిచాడు. నాచురల్ స్టార్ నాని సినిమా దసరా ఆ సినిమాతో నాని ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఏడో స్థానంలో నిలిచాడు. చాలా గ్యాప్ తీసుకుని సక్సెస్ ని సాధించిన వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా చిరంజీవి ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఈమధ్య విజయ్ దేవరకొండ మాత్రం తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ధమాకా సినిమాతో మాస్ మహారాజు రవితేజ పదో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఈ పొజిషన్స్ మాత్రం ప్రతి నెల మారుతూ ఉంటాయి.

Share post:

Latest