ఫిలిం స్టూడియోలో ఎన్టీఆర్ పెట్టబడులు.. నిజం ఏంటంటే..?

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే చాలామంది హీరోలు సినిమాల ద్వారా వచ్చిన డబ్బులు వివిధ రంగాలలో పెట్టుబడులుగా పెడితే తమ ఆదాయాన్ని పెంపొందించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ కూడా తాను సినిమాల ద్వారా సంపాదించడం డబ్బులు తన స్నేహితులతో కలిసి ఒక ఫిలిమ్ స్టూడియోలో ఇన్వెస్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ శంషాబాద్ దగ్గర కొంతమంది స్నేహితులతో కలిసి స్థలం కొన్నారని, అక్కడ ఐదంతస్తులు ఉన్న ఒక స్టూడియోని కూడా నిర్మించారు అని సమాచారం.

Exclusive: NTR Invests in a Film Studio

ఇకపోతే ప్రస్తుతం అందులోనే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తన 30వ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా నిర్వహిస్తున్నారు అని సమాచారం. అంతేకాదు ఇంతకు ఎన్టీఆర్ తో పాటు సదరు స్టూడియోలో ఇన్వెస్ట్ చేసిన ఫ్రెండ్స్ ఎవరు అని ఆరా తీయగా.. ఒకరేమో వివేక్ కూచిబొట్ల, మరొకరేమో నిర్మాత అభిషేక్ అగర్వాల్, ఇంకొకరు తాహిర్ టెక్నిక్స్ స్టూడియో.. ఈ తాహిర్ స్టూడియో సినిమా షూటింగులకు అవసరమైన కెమెరాలు, క్రేన్స్ వంటి వాటిని లీజుకు ఇస్తూ ఉంటారు. ఇది ఇన్సైడ్ వస్తున్న సమాచారం. ఇందులో ఏమాత్రం నిజం లేదని స్టూడియో నిర్మాణంలో ఎన్టీఆర్ పెట్టుబడులు పెట్టలేదని కళ్యాణ్ రామ్ నిర్మాణ సంస్థలో మాత్రమే పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం.

ఎవరో కావాలని ఎన్టీఆర్ పేరును వాడేస్తున్నారు అని చెబుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం క్రేజ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా కావడం గమనార్హం. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ కూడా పూర్తయింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Share post:

Latest