ఎన్టీఆర్ కోసం మాస్ కా దాస్ సై అంటున్నాడే….!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ మేనియా నడుస్తోంది. తారక్, బన్నీ, రామ్ చరణ్, ఇలా అందరు వరుసపెట్టి త‌మ పాత సినిమాలన్నీ మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. జనాలు కూడా వాటిని తెగ చూస్తున్నారు. మళ్ళీ హిట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ న‌టించిన ఇండ‌స్ట్రీ హిట్ సింహాద్రి సినిమాను కూడా ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో యంగ్ టైగ‌ర్‌ మరో స్టెప్ ముందుకు వేశాడు. సింహాద్రి సినిమా రీ రిలీజ్ కు ప్రి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Jr NTR: Simhadri is another sensation.. for the first time in the history  of Tollywood! | Jr NTR Simhadri Movie Re-Release Event on May 17th

ఈ ఈవెంట్‌కు యంగ్ హీరో విశ్వక్ సేన్ ముఖ్యఅతిథిగా రాబోతున్నాడు. ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమైన విశ్వక్ సేన్ తన అభిమాన హీరో సినిమాకి చీఫ్ గెస్ట్ గా వ‌చ్చేందుకు చాలా ఖుషీగా ఉన్నాడు. సింహాద్రి సినిమాని ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుక‌గా మే 20న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మే 17వ తేదీన హైదరాబాద్ లో ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇప్పుడు ఈవెంట్ కి విశ్వక్ సేన్ ని ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు.

Vishwaksen to attend Simhadri's Pre-release Event

తన అభిమాన హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విశ్వ‌క్‌ను గెస్ట్ గా పిలవడం పట్ల ఆయన చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. సింహాద్రి సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఇందులో భూమిక చావ్లా , అంకితలు హీరోయిన్లు గా నటించారు. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్, రాజమౌళి కూడా వస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.

Share post:

Latest