ఆ విష‌యంలో మ‌హేష్ కంటే విజ‌య్ దేవ‌ర‌కొండే తోపు.. ఇంత కంటే ప్రూఫ్ కావాలా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండకు ఉన్న క్రేజ్‌, డిమాండ్ గురించి ప్ర‌త్యేకంగా వివ‌రిచ‌క్క‌ర్లేదు. `అర్జున్ రెడ్డి` మూవీతో ఓవ‌ర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న విజ‌య్‌.. ఆ త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. గ‌త ఏడాది `లైగ‌ర్` మూవీతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచింది.

అయినాస‌రే విజ‌య్ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఆయ‌న‌తో సినిమా చేసేందుకు స్టార్ డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు పోటీప‌డుతున్నారు. మ‌రోవైపు విజ‌య్ బ్రాండ్ వాల్యూ కూడా భారీగా పెరిగిపోతోంది. దీంతో ఒక పక్క సినిమాలు.. మ‌రోవైపు కమర్షియల్ యాడ్స్ కూడా న‌టిస్తూ భారీ మొత్తం లో సంపాదిస్తున్నారు.

ఇక ఒకప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్స్ చేసిన ‘థమ్స్ అప్’ యాడ్ కూడా ఇప్పుడు విజయ్ దేవరకొండనే చేస్తున్నాడు. అయితే మహేష్ బాబు తో కాంట్రాక్టు ఉన్నన్ని రోజులు ‘థమ్స్ అప్’ సంస్థ వారు ఒక్కో యాడ్ వీడియో కి రూ. 2 కోట్లు చొప్పున రెమ్యున‌రేష‌న్ ఇచ్చేవారు. కానీ, విజ‌య్ ఒక్కో యాడ్ కు థమ్స్ అప్ సంస్థ నుంచి రూ. 3 కోట్లు తీసుకుంటున్నాడ‌ట‌. అలాగే ఇత‌ర సంస్థ‌ల యాడ్స్ కు కూడా విజ‌య్ ఇంతే స్థాయిలో ఛార్జ్ చేస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. మొత్తానికి యాడ్స్ రెమ్యున‌రేష‌న్ విషయంలో మ‌హేష్ కంటే తానే తోపు అని విజ‌య్ ప్రూవ్ చేసుకున్నాడు.

Share post:

Latest