రష్మిక జిమ్ వర్కర్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!

టాలీవుడ్ లో హీరోయిన్ రష్మిక స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఫిట్నెస్ కు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. రష్మిక ఫిట్నెస్ తోనే ఎక్కువగా పలు సినిమాల అవకాశాలను అందుకుంటుందని చెప్పవచ్చు వాటిని సరిగ్గా వినియోగించుకొని ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరు పొందింది. ముద్దుగా ఈ ముద్దు గుమ్మని నేషనల్ క్రష్ అని కూడా పిలుస్తూ ఉంటారు. పుష్ప సినిమాలో డి గ్లామరస్ పాత్రలో అద్భుతంగా నటించింది రష్మిక.

Rashmika Mandanna becomes the 'strong woman' she always wanted to be as she  shares a new intense workout video. Watch | Health - Hindustan Times

ఇక ఈ సినిమాతో తన రేంజ్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో అవకాశాలను అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. కానీ పుష్ప సినిమా తర్వాత సరైన సక్సెస్ అందుకోలేక సతమతమవుతోంది. బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అడుగుపెట్టిన అక్కడ కూడా తీవ్ర నిరాశ ఎదురవుతోంది. ముఖ్యంగా రష్మిక జిమ్ వర్కౌట్లు చేస్తున్నటువంటి ఒక వీడియో తన ఇంస్టాగ్రామ్ ల షేర్ చేసింది. ఆ వీడియో చూసిన నెటిజెన్లు సైతం ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

ఎందుచేత అంటే ఆ వీడియోలో రష్మిక చాలా కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రష్మిక అందాన్ని కాపాడుకోవడం కోసం ఫిట్నెస్ కోసం ఇలా చేస్తుందా అంటూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. సోషల్ మీడియా నేటిజన్లు తో పాటు ప్రేక్షకులు కూడా. ముఖ్యంగా ఫుట్ బాల్ పైన తన చేతులు కాళ్లతో బ్యాలెన్స్ చేస్తూ తను చేసే కసరత్తును చూస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. దీంతో పలువురు నెట్టిజెన్లు సైతం రష్మిక అందం వెనుక ఇంత కష్టం ఉందా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.