తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు వీకే నరేష్ , నటి పవిత్ర లోకేష్ వివాహం చేసుకోబోతున్నారు అనే విషయం వైరల్ గా మారినప్పటి నుంచి వీరిద్దరి పేర్లు తెగ వైరల్ గా మారుతున్నాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారనే విషయం నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి తెలిసి వీరిద్దరని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ప్రయత్నాలు చేసింది. కానీ నరేష్ మాత్రం తన మూడవ భార్యతో ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని తెలియజేస్తూ వచ్చారు.. తాజాగా రమ్య రఘుపతి ఎపిసోడ్ లో ట్విస్టుల మీద ట్విస్టు లు బయటపడుతున్నాయి.
ఇక భార్య రమ్యతో తనకి ప్రాణ హాని ఉందంటూ కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది నరేష్. తనను చంపేందుకు తన ఇంటి దగ్గర రెక్కీ చేయించింది అంటూ కోర్టులో కూడా పిటిషన్ వేశారు కర్ణాటక రౌడీ రాకేశ్ శెట్టితో ఈమె తనను చంపించాలనుకుంటోంది అంటూ తెలియజేశారు. కృష్ణ మరణించిన సమయంలో ఈ రెక్కి జరిగిందని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. పోలీస్ అధికారి సహాయంతో తన ఫోన్ హ్యాక్ చేయించిందంటూ నరేష్ తెలియజేస్తున్నారు.
రమ్య నరేష్ ఎపిసోడ్ల సీనియర్ పొలిటికల్ పేర్లు కూడా తెరపైకి వినిపిస్తూ ఉన్నాయి. మాజీ మంత్రి రఘువీరారెడ్డి పేరుతో బెదిరింపులకు దిగుతున్నట్లు రమ్య వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రూ .10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే సెటిల్మెంట్ చేసుకుంటానంటూ మధ్యవర్తితో రమ్య , నరేష్ నీ బెదిరిస్తోందని సమాచారం. ఈ బెదిరింపులకు సంబంధించి కీలక ఆధారాన్ని నరేష్ తెలియజేస్తున్నారు. రమ్య ప్రవర్తన పైన మరొకసారి పెను సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ఇక నరేష్ పెళ్లి అయినా నెల నుంచే తనను వేధించడం మొదలుపెట్టిందని విషయాన్ని బయట తెలిపారు నరేష్.