ఐప్యాక్ సర్వే లీక్…ఐదుగురు మంత్రులే గట్టెక్కేది?

ఏపీలో ఎన్నికల సీజన్ మొదలైపోయింది..గట్టిగా చూసుకుంటే ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. అందుకే ప్రతి పార్టీ ఎన్నికల్లో సత్తా చాటాడానికి కొత్త కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నాయి. అటు ప్రధాన పార్టీలు తమ బలాబలాలపై సర్వేలు కూడా చేయించుకుంటున్నాయి. ఇదే సమయంలో అధికార వైసీపీ కోసం ఐప్యాక్ సంస్థ పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఐప్యాక్ సంస్థ..తాజాగా చేసిన అంతర్గత సర్వేలో ఊహించని ఫలితాలు వెలువడ్డాయని ప్రచారం జరుగుతుంది.

ఆ సర్వేలో మంత్రులు, మాజీ మంత్రులకు భారీ షాక్ తగలడం ఖాయమని తెలిసింది. కానీ ఆ సర్వే నిజమో కాదో అనేది క్లారిటీ లేదు..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సర్వేలో ఇప్పుడున్న 25 మంత్రుల్లో కేవలం 5 గురు మంత్రులు మాత్రమే మళ్ళీ గెలవగలరని సర్వేలో తెలినట్లు చూపిస్తున్నారు. సర్వే ప్రకారం రాయలసీమకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు), అంజాద్‌ బాషా (కడప), నారాయణ స్వామి(గంగాధర నెల్లూరు) మళ్ళీ గెలుస్తారని, వీరికి పోటీగా టీడీపీలో సరైన అభ్యర్ధులు లేకపోవడం వల్లే..మళ్ళీ గెలవడానికి ఛాన్స్ ఉందని తేలింది.

అటు కోస్తా జిల్లాలన్నింటికీ కలిపి ఇద్దరు మంత్రులు మాత్రమే నెగ్గే అవకాశమున్నట్లు సర్వేలో తేలింది. వారు కూడా గోదావరి జిల్లాలకు చెందిన వారు కావడం విశేషం. పినిపె విశ్వరూప్‌ (అమలాపురం), దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) (తుని) మాత్రమే గెలిచే అవకాశమున్న వారి జాబితాలో ఉన్నారు.

అటు మాజీ మంత్రుల్లో సైతం కేవలం ఇద్దరు మాత్రమే మళ్ళీ గెలుస్తారని సర్వేలో తేలింది. ధర్మాన కృష్ణదాస్‌, కొడాలి నాని మాత్రమే మళ్లీ గెలిచే అవకాశాలున్నాయని తేలింది. అయితే ఈ సర్వే ఎంతవరకు నిజమనేది చెప్పలేని పరిస్తితి. ఎందుకంటే బుగ్గన రాజేంద్ర, బొత్స సత్యనారాయణ లాంటి వారు ఓడిపోతారని చెప్పడం ఆశ్చర్యకరంగానే ఉంది. కాబట్టి ఈ సర్వే వాస్తవానికి కాస్త దూరంగానే ఉందని చెప్పాలి.