ఆ హీరోను ప్రాణంగా ప్రేమించిన జ‌మున‌ మ‌రొక వ్య‌క్తిని ఎందుకు పెళ్లి చేసుకుంది?

సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ జమున ఇక లేరు అన్న సంగతి తెలిసిందే. ఆమె వ‌య‌సు 86. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా జ‌మున‌ హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. జ‌మున మ‌ర‌ణం ప‌ట్ల సినీ ప్ర‌ముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసుకున్నారు. ఇక‌పోతే జ‌మున మ‌ర‌ణం సంద‌ర్భంగా ఆమెకు సంబంధించి ఎన్నో విష‌యాలు తెర‌పైకి వ‌చ్చాయి.

అందులో జ‌మున ప్రేమ వ్యవ‌హారం కూడా ఒక‌టి. ఎన్టీఆర్,ఏఎన్నార్ శకం మొదలయ్యాక స్టార్ హీరోయిన్స్ అంటే సావిత్ర త‌ర్వాత జ‌మున పేరే వినిపించేది. అయితే అగ్ర‌హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న స‌మ‌యంలో జ‌మున ఓ స్టార్ హీరోతో ప్రేమ‌లో ప‌డింద‌ని అప్ప‌ట్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు హ‌ర‌నాథ్‌. రొమాంటిక్ హీరోగా హ‌రనాథ్ పాపుల‌ర్ అయ్యారు. అలాగే పౌరాణిక పాత్రలకు కూడా చక్కగా సరిపోయేవాడు. మంచి నటుడు పైగా అందగాడు కావడంతో హరనాథ్ ని ప్రాణంగా ప్రేమించిద‌ట జ‌మున‌.

కానీ, ఈ విషయం తెలిసిన ఎస్వీ రంగారావు జమునను హెచ్చరించారట. హరనాథ్ పేరు ఎత్తకుండా.. ఓ కుర్ర హీరోకి దగ్గరయ్యావని అందరూ అనుకుంటున్నారు. అతడు ఎన్టీఆర్ అంతటివాడు అవుతాడని అనుకుంటున్నారు. కానీ నాలా తాగుబోతు అవుతాడు.. జాగ్రత్త అని హితబోధ చేశాడట. అప్ప‌టి నుంచి జ‌మున త‌న ప్రేమ‌ను చంపుకుని హ‌రనాథ్ కు దూర‌మైంద‌ని ఇండ‌స్ట్రీలోకి టాక్ ఉంది. ఇక జ‌మున 1965లో జూలూరి రమణరావును వివాహం చేసుకున్నారు జమున. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఈ దంప‌తుల‌కు ఒక కొడుకు, కూతురు జ‌న్మించారు.