రాజానగరం జనసేనకే..పెందుర్తి అందుకే తప్పుకున్నారా?

తెలుగుదేశం పార్టీలో ఊహించని మార్పులు జరుగుతున్నాయి..నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి రావాలని చూస్తున్న చంద్రబాబు..పార్టీలో కీలక మార్పులు చేయడానికి చూస్తున్నారు. ముఖ్యంగా జనసేనతో పొత్తు దృష్టిలో పెట్టుకుని బాబు ముందుకెళుతున్నారు పొత్తు ఉంటే కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది. ఆ దిశగా కొందరు నేతలకు ముందుగానే సీట్లు త్యాగం చేయించేలా బాబు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే మాజీ మంత్రి ఆలపాటి రాజా తెనాలి సీటుని వదులుకున్నట్లే కనిపిస్తోంది. అక్కడ జనసేన తరుపున నాదెండ్ల మనోహర్ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదే క్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం సీటు సైతం జనసేనకు దక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరుపున పెందుర్తి వెంకటేష్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వైసీపీ తరుపున జక్కంపూడి రాజా విజయం సాధించారు. అయితే ఓడిపోయాక పెందుర్తి అక్కడ పికప్ అవ్వలేదు.

ఇదే అంశంపై ఇటీవల చంద్రబాబు..పెందుర్తికి క్లాస్ ఇచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన పెందుర్తి..ఇంచార్జ్ పదవికి రాజీనామా చేశారు. ఇక రాజానగరం సీటు ఎవరికి ఇచ్చిన వారి గెలుపు కోసం పనిచేస్తానని చెప్పారు. అంటే ఈ సీటు జనసేనకు ఇస్తారనే ప్రచారం నేపథ్యంలోనే పెందుర్తి ఇంచార్జ్ పదవికి రాజీనామా చేశారని ప్రచారం జరుగుతుంది.

అయితే రాజానగరంలో జనసేనకు కాస్త పట్టు ఉంది..కానీ టీడీపీకి బలం ఎక్కువ. రెండు పార్టీలు కలిస్తేనే ఇక్కడ వైసీపీని నిలువరించడం సాధ్యమవుతుంది. మరి చూడాలి రాజానగరం సీటు చివరికి ఎవరికి దక్కుతుందో.