దీపికా పదుకొనే ఏడాది సంపాదన ఎన్ని కొట్లో తెలుసా..?

బాలీవుడ్ హీరోయిన్ దీపికపదుకొనె క్రేజ్ ప్రతి సినిమాకు అంతకంతకు పెరుగుతోంది. దీంతో పాపులర్ బ్రాండ్ తన వెంట క్యు కడుతున్నాయి. పెళ్లి తర్వాత కూడా ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఒక వైపు వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లకు ప్రచారకర్తగా భారీ ఆదాయం ఆర్జిస్తోంది. ఈమె ఒక్కో సినిమాకు సుమారు రూ .15 కోట్ల నుంచి రూ .20 కోట్ల పారతోషకం తీసుకుంటోంది.ఇండియా సినిమాలకు రూ .20 కోట్లకు తగ్గకుండా డిమాండ్ చేస్తోందని ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి.

SCOOP: Deepika Padukone to play Meenamma in a song in Ranveer Singh starrer  Cirkus? : Bollywood News - Bollywood Hungama

దాదాపు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తున్న దీపిక రూ .50 కోట్ల పైగా తీసుకుంటోంది. దీపిక ఇక ఈమె సినిమాలు పాన్ ఇండియా పేరుతో ఎన్నో భాషలలో రిలీజ్ అవుతున్నాయి. ప్రభాస్ ,నాగ్ అశ్విన్ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కె కోసం దీపిక పడుకొని రూ.20 కోట్ల డిమాండ్ చేసిందని కథనాలోచ్చాయి. అలాగే కింగ్ ఖాన్ షారుక్ సరసన నటిస్తున్న పఠాన్ మూవీ కోసం రూ .20 కోట్ల వరకు డిమాండ్ చేసిందని అయితే రూ .15 కోట్లు కు ఒప్పందం కుదిరిందని ముంబై మీడియాలో వార్తలు వినిపించాయి.

deepika padukone: 'Gehraiyaan' trailer drops. And Ranveer Singh drops 'my  baby girl lookin like a Fazillion bucks' praise for wife Deepika Padukone -  The Economic Times

అంతేకాకుండా దీపిక పడుకొనే అంతర్జాతీయ బ్రాండ్లలో కార్టియర్.. లూయిస్ విట్టన్… లెవీస్ లాంటి పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయి. లేస్.. గార్నియర్… వంటి అనేక భారతీయ బ్రాండ్లకు అంబాసిడర్ గా పనిచేస్తోంది. అంతేకాకుండా వీటికి తోడు దీపిక పరోపకారి మానసిక ఆరోగ్య నిపుణురాలు పలు పలు సేవలలోను పాల్గొంటుంది.ప్రజల మానసిక ఆరోగ్యం ఇతర సామాజిక సమస్యల గురించి అవగాహన పెంచడానికి వివిధ సేవా సంస్థలతో కలిసి దీపిక పని చేస్తోంది. ఇలా వీటన్నిటినీ కలుపుకొని ఈమె ఏడాదికి రూ.100 నుంచి రూ.140 కోట్ల రూపాయల రేంజ్ లో సంపాదిస్తున్నట్లు సమాచారం.