ట్విన్ సిస్ట‌ర్స్ నుంచి అడివి శేష్‌కు పెళ్లి ప్రపోజల్.. హీరో రియాక్ష‌న్ ఏంటంటే?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ ప‌రంగా య‌మా జోరు చూపిస్తున్నారు. గ‌త ఏడాది `మేజ‌ర్‌` మూవీతో సూప‌ర్ హిట్‌ను అందుకుని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించిన అడివి శేష్.. ఆ త‌ర్వాత `హిట్ 2`తో మ‌రో హిట్ అందుకున్నాడు.

వైవిధ్యమైన కాన్సెప్ట్, కంటెంట్ ప్రాధాన్యత చిత్రాలకు కేరాఫ్ గా మారిన అడివి శేష్‌.. రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌కు ఎదురైన ఓ విచిత్ర సంఘ‌ట‌న‌ను పంచుకున్నాడు. వాస్త‌వానికి అడివి శేష్ లేడీస్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ‌. అయితే కొన్ని సంవత్సరాల క్రితం 20 ఏళ్ల వయసులో ఉన్న ట్విన్ సిస్టర్స్ అడివి శేష్‌ దగ్గరికి వచ్చి పెద్ద అభిమానులం అని చెప్పార‌ట‌.

అంతేకాదు, వారి తల్లిదండ్రుల ఎదుటే అడివి శేష్ కు ఏకంగా పెళ్లి చేసుకుంటామంటూ ప్రపోజల్ పెట్టారట‌. ఆ ఊహించ‌ని ప‌రిణామానికి అడివి శేష్ కు షాక్ కి గుర‌య్యాడ‌ట‌. ఆ సమయంలో ఎలా స్పందించాలో అర్ధం కాలేద‌ని, ఫేస్ టూ పేస్ అలాంటి సన్నివేశాలు ఫేస్ చేయాలంటే చాలా ధైర్యం కావాలని అప్పుడే అర్ధమైంద‌ని అడివి శేష్ చెప్పుకొచ్చాడు. ఇక రిలేషన్షిప్ స్టేటస్ గురించి అడ‌గ‌గా.. `అది చాలా సంవత్సరాలుగా సంక్లిష్టంగా ఉంది` అంటూ శేష్ తెలివిగా స‌మాధానం ఇచ్చాడు.