మంచి టైమింగ్ మిస్ అయిన బాల‌య్య‌… సంక్రాంతి రేసు నుంచి అవుట్‌…!

బాలకృష్ణ కెరియర్ లోని అత్యంత బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమా అఖండ. ఈ సినిమా 2021 చివరలో విడుదలై టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్‌ చేసేసింది. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులను అభిమానులు అంత సులభంగా మర్చిపోలేనంత విధంగా బాలకృష్ణ అదరగొట్టాడు. సినిమాలో అఘోరాగా బాలయ్య విశ్వరూపం చూపించాడు. ఇక‌ ఈ సినిమాకు సంగీతం అందించిన థ‌మన్‌ కూడా తన విశ్వరూపం చూపించి థియేటర్లో బాక్సులు బద్దలు కొట్టాడు.

బోయపాటి- బాలయ్య మూడు సినిమాగా వచ్చిన ఈ సినిమాలో బోయపాటి ఆధ్యాత్మిక విశేషాలకు ఊర మాస్ టచ్ తో చూపించడం సినిమా ఘనవిజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో పెన్ సంస్థ భారీ ఎత్తున ఈ నెల 20న రిలీజ్ చేయబోతున్నారు. అయితే బాల‌య్య అభిమానులు మ‌త్రం మీకు ఇంతకన్నా మంచి డేట్ దొరకలేదా అని పెదవి విరుస్తున్నారు.

Akhanda Hindi Trailer I Release Date I Hindi Dubbed I Akhanda Hindi Dubbed  Release Date I अखण्डा - YouTube

ఎందుకంటే సరిగ్గా ఐదు రోజులకి షారుఖ్ ఖాన్ పఠాన్ రీలీజ్ అవుతుంది. సహజంగానే బాలీవుడ్ ఆడియన్స్ దృష్టి మోత్తం షారుఖ్ సినిమా మీదే ఉంది. ఏదో మీడియం రేంజ్ హీరోది అయితే టెన్షన్ అవసరం లేదు కానీ మూడేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న బాద్‌షా మూవీ అవడంతో ప్రేక్షకుల దృష్టి సహజంగా పఠాన్ మీదే ఉంటుంది. అలాంటపుడు అయిదు రోజుల రన్ తో అఖండ ఏం సాధిస్తుంద‌ని ఫ్యాన్స్‌ అంటూన్నారు.

Akhanda Worldwide Closing Collection: Career Best Figures For Nandamuri  Balakrishna! - Filmibeat

అయితే ఈ సినిమాని సంక్రాంతికి హిందిలో రీలిజ్ చేసి వుంటే మ‌రో లెవ‌ల్‌లో ఉండేద‌ని అభీమానులు అంటూన్న‌రు. అఖండ కూడా కాంతార తరహా స్పిరిచువల్ టచ్ ఉన్న కమర్షియల్ డ్రామా ఆ అవకాశాన్ని వాడుకోవడానికి మంచి ఛాన్స్ ఉండేది. ఇప్పుడూ మరీ మించిపోలేదు కానీ పఠాన్ కు ఎలాంటి టాక్ వస్తుందనే దాన్ని బట్టే ఈ లెక్కలన్నీ ఆధారపడి ఉంటాయి.