ఏంటీ.. మ‌హేష్‌-రాజ‌మౌళి సినిమా ప‌ట్టాలెక్క‌క‌ముందే రూ. 20 కోట్లు ఖ‌ర్చా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్‌28` వ‌ర్కింగ్ టైటిల్ తో ప్రారంభ‌మైన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్ళింది.

ఈ మూవీ అనంతరం మహేష్ దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా చిత్రం చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై గ‌త ఏడాదే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. సీనియ‌ర్ నిర్మాత కెఎల్ నారాయణ ఈ సినిమా దాదాపు రూ. 500 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించ‌బోతున్నారు. రాజ‌మౌళి తండ్రి, ప్రముఖ రచయిత కెవి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి క‌థ అందిస్తున్నాడు. ఇది అడ్వెంచర్ స్టోరి. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ మూవీ ఉండ‌బోతోంది. `ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29` వ‌ర్కింగ్ టైటిల్ తో త్వ‌ర‌లోనే ఈ మూవీ ప్రారంభం కానుంది.

ప్ర‌స్తుతం స్క్రిప్ట్‌, ప్రీ ప్రొడెక్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే ఇంట్రెస్టింగ్ విష‌యంలో ఏంటంటే.. ఈ సినిమాకు ప‌ట్టాలెక్క‌క‌ముందే రూ. 20 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నార‌ట‌. ప్రీప్రొడక్షన్ వర్క్ లో భాగంగా క్యాస్టింగ్ సెలక్షన్ లొకేషన్స్ చూడటానికి రాజమౌళి ఆఫ్రికా వెల్లబోతున్నారు. అలాగే సినిమ స్టొరీని కాన్సెప్ట్ ఆర్ట్ గా సిద్ధం చేసి తాను ఎలా సినిమాని తీయబోయేది ముందుగానే విజువల్ గా సిద్ధం చేసుకునే పనిలో రాజ‌మౌళి పడ్డారు. ఇందుకు దాదాపుగా రూ. 20 కోట్ల బ‌డ్జెట్ అవుతుంద‌ని అంటున్నారు. మొత్తానికి షూటింగ్ స్టార్ట్ కాక‌ముందే రాజ‌మౌళి నిర్మాత‌తో గ‌ట్టిగా ఖ‌ర్చు పెట్టించ‌బోతున్నారు.