ఆ సినిమా చేయ‌డం బాల‌య్య జీవిత‌ క‌లా.. టైటిల్ కూడా ఇదే….!

నందమూరి బాలకృష్ణ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అయ‌న సినీ కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు తీశారు. అన్ని రకాల పాత్రలో నటించారు.ట పౌరాణిక‌, జాన‌ప‌ద‌, చారిత్ర‌క‌, సాంఘిక, సైన్స్ ఫిక్ష‌న్‌ వంటి ఎన్నో జాన‌ర్‌లో ఆయన నటించారు. బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

దీంతో ఈ సినిమా ప్రమోషన్లు ఎంతో జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజ‌ర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నిన్న ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఒంగోల్‌లో ఎంతో గ్రాండ్గా నిర్వహించారు. అక్కడ ఈ సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈవెంట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు బాల‌య్య దృష్టి.. ‘చంఘీజ్ ఖాన్‌’ పై ప‌డింది. ఎప్ప‌టికైనా స‌రే.. ఛంఘీజ్ ఖాన్ సినిమా చేస్తాన‌ని… ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో ప్ర‌క‌టించాడు. అయితే దానికి టైమ్‌ రావాలి అన్నాడు చరిత్రలో ‘చంఘీజ్ ఖాన్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. అతను మంగోల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు. చరిత్రలోనే అతిపెద్ద సామ్రాజ్యంగా మంగోల్‌ సామ్రాజ్యాన్ని పేర్కొంటారు.

Genghis Khan Explained In 8 Minutes - YouTube

ఆ సామ్రాజ్య స్థాపన కోసం చంఘీజ్ ఖాన్ ఏం చేశాడు.. తన పోరాటం ఎలా కొనసాగించాడు.. అనే విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. చంఘీజ్ ఖాన్‌ పై రకరకాల పుస్తకాలు కూడా ఎన్నో వచ్చాయి తెలుగులో కూడా ఈ పేరుతో వచ్చిన పుస్తకానికి సాహిత్య వేదిక కూడా ఎంత గొప్ప స్థానం ఇచ్చింది ఇప్పుడు బాలకృష్ణ దృష్టి ఈ సినిమాపై పడింది.

సరైన దర్శకుడు దొరికితే బాలయ్య కల నెరవేరినట్టే. అయితే ఇంత పెద్ద కథను.. ఇంత పెద్ద చరిత్రను నడపగలిగే దర్శకుడు ఎవరన్నది ? బాలయ్య అభీష్టం మేరకు ఉంటుంది. ప్రస్తుతం బాలయ్య వీర సింహారెడ్డి సినిమా ముగించుకుని అనిల్ రావిపూడి సినిమాలో బిజీ అవుతున్నాడు.