7/G బృందావన కాలనీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

టాలీవుడ్ హీరోయిన్ సోనియా అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట 7/G బృందావన కాలనీ సినిమాతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ సినిమా కంటే ముందు ధమ్, నీ ప్రేమకై వంటి తెలుగు సినిమాలలో నటించింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ 7/G బృందావన కాలనీ సినిమాతో సక్సెస్ అందుకోవడంతో ఈమెకు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి.. దీంతో సరైన సక్సెస్ అందుకోలేకపోవడంతో కనుమరుగైపోయింది సోనియా అగర్వాల్. ఇక డైరెక్టర్ సెల్వరాగవన్ ను ఈమె వివాహం చేసుకుంది.

1 వ్యక్తి చిత్రం కావచ్చు

అలా వివాహం చేసుకున్న కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడంతో కాస్త డిస్టర్బ్ అయింది. అటు తర్వాత తమిళ్, మలయాళం, కన్నడ వంటి సినిమాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే సోనియా ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు తన ఫోటో సూట్లను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.

1 వ్యక్తి చిత్రం కావచ్చుఇక తన కుటుంబానికి సంబంధించిన విషయాలన్నిటిని షేర్ చేస్తూ ఉంటుంది. తమిళంలో ప్రస్తుతం పలు టీవీ సీరియల్స్ లో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే సోనియా అగర్వాల్ పర వెబ్ సిరీస్లలో పాటు మూడు కోలీవుడ్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

1 వ్యక్తి, నిల్చుకోవడం చిత్రం కావచ్చు

సోనీ అగర్వాల్ తాజాగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సినిమాలలో గ్లామర్ షో చూపించడంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికీ అదే అందంతో అవకాశాలను అందుకుంటునే బిజీ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. అయితే టాలీవుడ్ లో మాత్రం ఈ ఉద్యోగం ఏ సినిమాలలో నటించలేదు.