పవన్‌పై ఆలీ పోటీ..జగన్ ఛాన్స్ ఇస్తారా?

ప్రత్యర్ధులని వ్యూహం ప్రకారం దెబ్బ  తీసే విషయంలో అధికార వైసీపీ ఎప్పుడు ముందే ఉంటుందని చెప్పాలి. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో రాజకీయం చేయడం…ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి ప్రత్యర్ధులని వీక్ చేసి దెబ్బకొట్టడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. గత ఎన్నికల్లో అదే మాదిరిగా ఓ వైపు టీడీపీ, మరోవైపు జనసేనలకు చెక్ పెట్టారు. అయితే ఈ సారి కూడా ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టాలని వైసీపీ చూస్తుంది.

అలాగే ఈ సారి కీలక నేతలకు మళ్ళీ చెక్ పెట్టాలని చెప్పి వారిపై వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలతో ముందుకెళుతున్నారు. కుప్పంలో చంద్రబాబుకు, మంగళగిరిలో లోకేష్‌కు చెక్ పెట్టాలని చూస్తున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్‌ని ఈ సారి కూడా ఓడించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి పవన్‌ని ఓడించడం ఈజీ కాదని అర్ధమవుతుంది. పైగా టీడీపీతో పొత్తు కూడా కలిసొచ్చేలా ఉంది. ఇలాంటి పరిస్తితుల్లో వైసీపీ సరికొత్త ప్లాన్‌తో ముందుకొస్తుంది.

ఈ క్రమంలో సినీ నటుడు, వైసీపీ నాయకుడుగా ఉన్న ఆలీ వచ్చే ఎన్నికల్లో పవన్‌పై పోటీ చేయడానికి రెడీ అని ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆలీ..పవన్‌కు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అనేది చెప్పాల్సిన పని లేదు. కానీ వైసీపీ వైపు వెళ్ళాక ఆలీ..పవన్‌కు దూరం జరిగారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం జగన్‌ చెబితే పవన్‌ కల్యాణ్‌పై పోటీకి సిద్ధమని డు ఆలీ చెప్పారు.

పవన్‌ కల్యాణ్‌ మిత్రుడైనా రాజకీయం వేరు అని,  కుటుంబం, స్నేహం, రాజకీయాలు వేర్వేరు అని, రాష్ట్రంలోని 175 సీట్లలో వైసీపీ గెలవడం ఖాయమని ఆలీ చెప్పుకొచ్చారు. అయితే ఆలీ పోటీ చేస్తానని అంటున్నారు..కానీ జగన్ సీటు ఇస్తారో లేదో క్లారిటీ లేదు..అదే సమయంలో గెలుపు దక్కుతుందో లేదో డౌటే?