Salar: మూవీ షూటింగ్ ఎంతవరకు అయిపోయిందంటే..?

కే జి ఎఫ్-1,-2 సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపి మంచి కలెక్షన్లను సాధించింది ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన ప్రభాస్ ,ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్. ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అప్పుడప్పుడు కొన్ని విషయాలు వినిపిస్తూ ఉంటాయి.ఈ సినిమా మేకర్స్ తాజాగా మరొక అప్డేట్ ఇచ్చి అభిమానులను ఖుషి చేసినట్లుగా తెలుస్తోంది.

Prabhas Salar: డ‌బుల్ ధ‌మాకా.. ఒక్క‌టి కాదు రెండు. పాన్‌ ఇండియా చిత్రాల  న‌యా ట్రెండ్.. ప్ర‌భాస్‌కూడా అదే బాట‌లో.? | Prabhas salaar movie director  planning to release this movie in ...
సలార్ సినిమా షూటింగ్ దాదాపుగా 30 నుంచి 35 రోజులలో పూర్తి అవుతుందని చిత్ర బృందం తెలియజేసినట్లు సమాచారం. తదుపరి రాబోయే షూటింగ్ షెడ్యూల్ ప్రభాస్ పాల్గొన్నారని తెలియజేశారు. మరొక రెండు రోజుల్లో జరగబోయే షెడ్యూల్సులో ప్రభాస్ పాల్గొని ఈనెల ఆఖరి వరకు నాన్ స్టాప్ షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సలార్ టీం తెలియజేస్తోంది. ఈ షెడ్యూల్లో మెజారిటీ షూటింగ్ పూర్తి అవుతుందని తెలియజేశారు. ఇక మిగిలిన భాగాన్ని రాబోయే కొద్ది రోజులలోనే ముగించే బోతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

సలార్ సినిమా విజయ్ కిరంగదూర్ నిర్మిస్తూ ఉన్నారు. హోం భలే ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు ఇప్పటికే.. మిడిల్ ఈస్ట్ ఆఫ్రికాలోని పలు దేశాలలో ఈ సినిమా షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం 5 భాషలలో విడుదల చేయబోతున్నారు. ఏకకాలంలో కన్నడ తెలుగు భాషలలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన విలన్ గా పృథ్విరాజ్ సుకుమారన్ తోపాటు జగపతిబాబు నటిస్తూ ఉన్నారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రాజెక్ట్ -k, స్పిరిట్, ఆది పురుష్, మారుతి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నారు.