పఠాన్ సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందంటే..?

షారుఖ్ ఖాన్ నటించిన గత చిత్రాలు భారీ డిజాస్టర్ కావడంతో చాలా గ్యాప్ తీసుకొని మరి ఇప్పుడు పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ చిత్రం బాలీవుడ్ లో ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించారు. ఈ సినిమాని ఎస్ రాజ్ ఫిలిం సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించారు .ఆదిత్య చోప్రా నిర్మాతగా, సిద్ధార్థ ఆనంద్ డైరెక్టర్ గా ఈ సినిమాకి వ్యవహరించారు ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తోంది. అయితే ఈ సినిమా నుంచి గతంలో విడుదలైన ఎలాంటి అప్డేట్ కూడా ఎన్నో వివాదాలకు దారితీసింది.

Shahrukh khan upcoming film pathan update know the trailer and song release  detail
2018లో జీరో సినిమా విడుదల తర్వాత షారుఖ్ ఖాన్ హీరోగా ఒక సినిమాలో కూడా చేయలేదు. సుమారుగా 4 సంవత్సరాల తర్వాత ఈ నెల 25వ తేదీన పఠాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకి రూ.250 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ చిత్రాన్ని నిర్మించినట్లుగా సమాచారం.దీంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు పెరిగిపోయాయి ఈ సినిమాకి సంబంధించి తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయినట్లుగా తెలుస్తోంది.రెండు గంటల 26 నిమిషాల పాటు సాగిన ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది.

జనవరి 20వ తేదీన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా అనేక ఫార్మేట్ లలో విడుదల కాబోతోంది.. ఐమాక్స్ ఫోర్డ్ ఎక్స్ డి.. ఫాక్స్ ఐసీఈ వంటి పలు ఫార్మెట్లలో ఏ సినిమాలు విడుదల చేయబోతున్నారు. గతంలో బేషారం పాట విడుదలైనప్పుడు ఈ సినిమా పైన చాలా నెగటివ్ టాక్ వినిపించింది.కచ్చితంగా ఈ సినిమానీ అడ్డుకుంటామంటూ హిందూ సంస్థలు పెద్ద ఎత్తున రచ్చ చేశాయి. అయితే అలాంటిది ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ వస్తుందని అందరూ భావించారు.. కానీ యూఏ అంటే పెద్దల పర్యవేక్షణలో చిన్న పిల్లలు కూడా చూడవచ్చు అంటూ సర్టిఫికెట్ని జారీ చేయడంతో హిందూ సంస్థలు ఈ సినిమా పైన ఎలా స్పందిస్తాయో చూడాలి.