పవన్ కళ్యాణ్ పై సంచలన ప్రకటన చేసిన ఆలీ..!!

సినీ నటుడు పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీ మంచి స్నేహితులు అన్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే గడచిన కొన్ని సంవత్సరాల క్రితం నుంచి వీరిద్దరూ మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా పొలిటికల్ పరంగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా కమెడియన్ ఆలీ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారులుగా పనిచేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పై తాజాగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

Ali Ready To Contest Against Pawan Kalyan

ప్రస్తుతం వైసీపీ అధికార పార్టీలో ఉన్న ఆలీ ,పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పోటీ చేసేందుకు సై అని తెలియజేస్తున్నారు. నగరిలో కొండ చుట్టూ ఉత్సవం సందర్భంగా నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆలీ పాల్గొనడం జరిగింది. అలీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై పోటీ చేయడానికి సర్వం సిద్ధమని తెలియజేశారు. పార్టీ ఆదేశాలు జారీ చేస్తే పవన్ పై నిలబడడానికి నేను సిద్ధమే అంటూ తెలిపారు. ఇక రాష్ట్రంలో 175 స్థానాలకు 175 స్థానాలలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల గెలుస్తారని చాలా ధీమాగా ఉన్నామని తెలిపారు ఆలీ.

మరొకసారి కూడా రోజా తన విజయాన్ని సాధిస్తుందని తెలిపారు.. మంత్రి రోజాపై పవన్ కళ్యాణ్ డైమండ్ రాణి కామెంట్ల పైన స్పందించారు..డైమండ్ అనేది చాలా పవర్ఫుల్ చాలా విలువైనది.. రోజా కూడా తగ్గేదే లేదు ఆమె ఫైర్ బ్రాండ్ ఆ విషయంలో అందరికీ తెలుసు.. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో ప్రజలందరికీ తెలుసు అని తెలిపారు. చిరంజీవి కుటుంబంతో మంత్రి మంచి అనుబంధం ఉన్నాయని తెలిపారు. రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు చేయడం సర్వసాధారణమని తెలిపారు.