“అడిగింది ఇస్తేనే వస్తా”..పూజ హెగ్డే కొత్త కండీషన్ కి ప్రోడ్యూసర్స్ షాక్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడానికి అందాల ముద్దుగుమ్మలు ..నానా తంటాలు పడుతున్నారు. అయితే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కొందరు ముద్దుగుమ్మలు మాత్రం హ్యూజ్ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ స్టార్ట్ డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు చుక్కలు చూపిస్తున్నారు . అదే లిస్టులోకి యాడ్ అయింది అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే . నిజానికి పూజ హెగ్డే కెరియర్ అప్ అండ్ డౌన్స్ తోనే కొనసాగింది . మొదట ఒక్క హిట్ కొట్టడానికి ..చాలా సంవత్సరాల గ్యాప్ తీసుకున్న పూజ.. ఆ తర్వాత ఫస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది .

దీంతో కొన్నాళ్లు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ట్యాగ్ చేయించుకుని రాజ్యమేలేసింది. అయితే ఆమె లాస్ట్ గా నటించిన మూడు సినిమాలు డిజాస్టర్ గా మారాయి. మరీ ముఖ్యంగా ముగ్గురు బడా హీరోలే కావడంతో మండిపడుతున్నారు వాళ్ల ఫ్యాన్స్. ఈ మధ్యనే కాళ్లు కూడా దెబ్బ తగలడంతో కొన్నాళ్లు సోషల్ మీడియాకి సినీ ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే మళ్లీ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్న పూజ కొత్త సినిమాకు సైన్ చేయాలంటే అడిగినంత అడ్వాన్స్ చెల్లిస్తే సినిమా అగ్రిమెంట్ల పేపర్లపై సైన్ చేస్తానంటూ క్రేజీ కండిషన్లు పెడుతుందట .

నిజానికి సినీ ఇండస్ట్రీలో ఉండే రూల్స్ ప్రకారం సినిమా కమిట్మెంట్ ఇచ్చే హీరోయిన్స్ 15% ముందుగా తీసుకుంటారు . ఆ తర్వాత మిగిలినది సినిమా షూట్ కంప్లీట్ అయ్యేసరికి వాయిదాల పద్ధతిలో చెల్లిస్తారు. అయితే పూజా హెగ్డే మాత్రం 50% రెమ్యూనరేషన్ ని ఒకేసారి ఇవ్వమనడం షాకింగ్ గా ఉంది అంటూ స్టార్ ప్రొడ్యూసర్స్ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి హీరోయిన్స్ ని బ్యాన్ చేసేయాలి అంటూ మండిపడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.