సమంత విషయంలో రాజకీయం జరుగుతోందా? అమెజాన్ ఆమె పేరుని ఎందుకు వేయలేదు?

హీరోయిన్ సమంత గురించి తెలుగునాట చిన్న పిల్లాన్ని అడిగినా చెబుతాడు. అంతలా ఆమె ఇక్కడ తన సినిమాల ద్వారా పేరుని సంపాదించుకుంది. అయితే కొన్నాళ్లుగా సమంత ఆరోగ్య పరిస్థితి గురించి అనేక వార్తలు వస్తున్నాయి. అయితే అందులో నిజం లేకపోలేదు. మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధితో సమంత ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సమంత తన షూటింగుల నుంచి బ్రేక్ తీసుకుంది. అయితే ఇపుడు సమంత ఆరోగ్య పరిస్థితి కొంచెం కుదుటపడిందని వార్తలు వస్తున్నాయి.

సమంత, విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న “ఖుషీ” సినిమా షూటింగ్ ఆమె అనారోగ్యం కారణంగా సగంలోనే ఆగిపోయిన విషయం తెలిసినదే. కాగా మరలా ఆ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు వున్నాయి. ఇక అసలు విషయానికొస్తే, అమెజాన్ ప్రైమ్ వీడియో వారు చేసిన ఒక ట్వీట్ వల్ల సమంత అభిమానులు కాస్త నొచ్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. సిటాడల్ అనే ఒక వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టులో సమంత వరుణ్ ధావన్ సరసన హీరోయిన్ గా నటించాల్సి ఉంది.

అయితే తాజాగా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను షేర్ చేసిన అమెజాన్ ప్రైమ్ వచ్చే ఏడాది జనవరి నుంచి షూటింగ్ మొదలవుతుందని ప్రకటించారు. ఈ క్రమంలో వరుణ్ ధావన్, రాజ్, డీకే మరియు ఇతర టెక్నికల్ టీం సభ్యుల పేర్లు ట్వీట్ లో భాగంగా ట్యాగ్ చేసారు గాని సమంత పేరుని మాత్రం సదరు ట్వీట్లో జత చేయలేదు. దీంతో సమంత ఆరోగ్య పరిస్థితి మళ్ళి క్షీణించి ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏది నిజం, ఏది అబద్దం అని తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన రావలసి వుంది.