గొప్ప గొప్ప హీరోయిన్లే ఆ పని చేశారు.. నేనెంత అంటూ శ్రీ‌లీల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

`పెళ్లి సందD` సినిమాతో తెలుగు తెరుకు పరిచయమైన యంగ్ సెన్సేష‌న్‌ శ్రీలీల.. ఇప్పుడు `ధమాకా` సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించాడు. జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం మరికొన్ని గంటల్లోనే థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌బోతోంది. అయితే ప్ర‌మోష‌న్స్ లో భాగంగా శ్రీ‌లీల తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకుంది. ఈ క్ర‌మంలోనే శ్రీ‌లీల‌కు `సోషల్ మీడియాలో రవితేజ గారి ఏజ్ గురించి మీ గురించి కొంత ట్రోలింగ్ జరుగుతుంది. దానిని మీరు ఎలా తీసుకుంటారు?` అనే ప్ర‌శ్న ఎదురైంది.

అందుకు శ్రీ‌లీల `నాకంటే గొప్ప గొప్ప హీరోయిన్లు స్టార్ హీరోలతో నటించేప్పుడు ఏజ్ గురించి పట్టించుకోలేదు. నేనెంత చెప్పండి. పైగా రవితేజ గారి ఎనర్జీ చూస్తే నాకంటే చిన్న వయసున్న వ్యక్తి అనిపిస్తుంది. అలాంటి ట్రోలింగ్ ను నేను పట్టించుకోను` అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అలాగే పెళ్లి సందD కంటే ముందే ధ‌మాకాను ఒప్పుకున్నాన‌ని, ఈ సినిమా అంద‌రినీ అల‌రిస్తుంద‌ని శ్రీ‌లీల పేర్కొంది. ఇక త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ.. బాల‌కృష్ణ‌-అనిల్ రావిపూడి సినిమా, రామ్-బోయ‌పాటి సినిమాల‌తో పాటు వైష్ణవ్ తేజ్, నితిన్ ల‌తో సినిమాలు చేస్తున్నాన‌ని చెప్పుకొచ్చింది.